Prabhudeva: ప్రభుదేవా గురించి సంచలన కామెంట్స్ చేసిన మాజీ భార్య.. ఏం చెప్పిందంటే..
టాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోగా, కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులకు దగ్గరైన ప్రభుదేవా.. ఇప్పుడు ఇండస్ట్రీలో తక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన మాజీ భార్య రామలత ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా, నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో అంతగా సినిమాల్లో కనిపించడం లేదు. ప్రభుదేవా ఎక్కువగా సినిమాలతో కాకుండా తన పర్సనల్ లైఫ్ తో వార్తలలో నిలిచింది. మొదటి భార్యతో విడాకులు.. ఆ తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రేమ, పెళ్లి వరకు వచ్చి ఆ వెంటనే బ్రేకప్.. చివరకు మరో డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా. ఇటీవలే తన భార్య, కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుదేవా తన కొడుకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుదేవా మాజీ భార్య రామలత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభుదేవా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రభుదేవా తెలుగు, తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు ఎక్కువగా హిందీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ప్రభుదేవా, రామ్‌లత్ ‘హిందూ’ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ సినిమాతోనే ప్రభుదేవా హీరోగా తమిళ చిత్రపరిశ్రమలోకి తెరంగేట్రం చేశారు. ఆ దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో ఒకరు అనారోగ్యంతో మరణించారు. నయనతారతో ప్రేమలో పడిన తర్వాత ప్రభుదేవా తన మొదటి భార్య రామలతకు విడాకులు ఇచ్చారు. కానీ కొన్ని రోజులకే నయనతారతోనూ విడిపోయారు.
తాజాగా రామలత మాట్లాడుతూ.. ‘మా కొడుకు పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నా కొడుకు డ్యాన్స్ పట్ల అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ గత రెండేళ్లలో పూర్తిగా మారిపోయింది. అతడు డ్యాన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తన తండ్రి రక్తం తనలో ప్రవహించడం వల్లే ఈ మ్యాజిక్ జరిగింది. విడాకుల తర్వాత ప్రభుదేవా నాకు ఎంతో మద్దతుగా ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :