Tollywood: ఈ నటుడి భార్య టాలీవుడ్ హీరోయినా.. ? ఇప్పుడు విలన్ పాత్రలతో రఫ్పాడిస్తోందిగా..
సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాంకీ. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఒకప్పుడు హీరోగా వెండితెరపై అలరించి ఇప్పుడు సహాయ నటుడిగా మారారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తీకేయ తండ్రిగా కనిపించారు. రాంకీ భార్య సైతం ఒకప్పుడు హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా.. ?

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలు.. ఇప్పుడు సహయ నటులుగా చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఉదాహరణకు జగపతి బాబు, శ్రీకాంత్ వంటి నటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ లో అటు సహాయ నటుడిగా, విలన్ పాత్రలలో కనిపిస్తున్నారు. అందులో నటుడు రాంకీ ఒకరు. అతడి అసలు పేరు రామకృష్ణ. సినిమాల్లోకి వచ్చాకా రాంకీ గా మార్చుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో హీరోగా మెప్పించారు. సింధూర పువ్వు సినిమాతో తెలుగులో మరింత పాపులర్ అయ్యాడు. నిజానికి ఈ చిత్రాన్ని తమిళంలో సెంథూర పూవే పేరుతో తెరకెక్కించగా.. తెలుగులోకి డబ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి చిత్రాలలో హీరోగా కనిపించారు. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో హీరోగా సినిమాలు చేశారు రాంకీ.
హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన రాంకీ.. ఇప్పుడు నటుడిగా కొనసాగుతున్నారు. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోకు ఫాదర్ గా కనిపించారు. ఆ తర్వాత రాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రంలోనూ నటించారు. తెలుగులో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన లక్కీ భాస్కర్ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా రాణిస్తున్న రాంకీ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రాంకీ భార్య సైతం తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నిరోషా. శ్రీలంకలో జన్మించిన నిరోషా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో బాలకృష్ణ సరసన నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్డ్ పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. రాంకీ నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిరోషా తమిళంలో బుల్లితెరపై రాణిస్తుంది. సీరియల్స్ లో విలన్ పాత్రలతో రఫ్పాడిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :