AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : “నువ్వు తోపు భయ్యా”..సంజు శాంసన్ విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ పోస్ట్

Vaibhav Sooryavanshi : టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన వేళ, యావత్ క్రికెట్ ప్రపంచం ఒకే ఒక పేరును జపిస్తోంది.. అదే సంజు శాంసన్.. వెస్టిండీస్‌తో జరిగిన అగ్నిపరీక్ష లాంటి మ్యాచ్‌లో సంజు వీరవిహారం చేశాడు.

Vaibhav Sooryavanshi : నువ్వు తోపు భయ్యా..సంజు శాంసన్ విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ పోస్ట్
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Mar 02, 2026 | 7:35 PM

Share

Vaibhav Sooryavanshi : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన వేళ, యావత్ క్రికెట్ ప్రపంచం ఒకే ఒక పేరును జపిస్తోంది.. అదే సంజు శాంసన్.. వెస్టిండీస్‌తో జరిగిన అగ్నిపరీక్ష లాంటి మ్యాచ్‌లో సంజు వీరవిహారం చేశాడు. అచ్చం క్వార్టర్ ఫైనల్ తరహాలో సాగిన ఈ పోరులో గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుందన్న ఉత్కంఠ మధ్య సంజు శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి, భారత్‌ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి, జట్టును సెమీస్ గడప దాటించి కానీ వెనుతిరగలేదు. సంజు చేసిన ఈ విధ్వంసాన్ని చూసి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మురిసిపోయాడు. తన ఆరాధ్య ఆటగాడు, అన్న లాంటి సంజు శాంసన్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా వైభవ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సమయంలో సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. తన పెద్దన్న టీమిండియా కోసం ఇంతటి కీలక సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో వైభవ్ ఆనందానికి అవధుల్లేవు. సంజు శాంసన్ ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఎక్స్‌ట్రా స్పెషల్ భయ్యా అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఇది కేవలం ఒక ప్రశంస మాత్రమే కాదు, సంజు అంటే వైభవ్‌కు ఉన్న గౌరవం మరియు ప్రేమాభిమానాలకు నిదర్శనం.

అయితే, సంజు శాంసన్ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, వైభవ్‌కు సంజుతో ఒక చిన్న డీల్ కూడా ఉంది. గతంలో వైభవ్ సూర్యవంశీ సంజు శాంసన్‌ను ఒక కోరిక కోరాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‎కి ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జట్టును వీడి వెళ్తున్న సమయంలో వైభవ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ.. “నువ్వు ఎక్కడికి వెళ్లినా సరే, నాకు మాత్రం నీ బ్యాట్లను ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి భయ్యా” అంటూ ఒక గమ్మత్తైన డిమాండ్ పెట్టాడు. సంజు బ్యాట్లతో ఆడితే తనకు బాగా కలిసి వస్తుందనేది వైభవ్ నమ్మకం కాబోలు.

ప్రస్తుతం సంజు శాంసన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచుల కోసం సిద్ధమవుతుంటే, వైభవ్ సూర్యవంశీ డీవై పాటిల్ టోర్నమెంట్‌లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో వీరిద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వైభవ్ రాజస్థాన్ తరఫున, సంజు చెన్నై తరఫున తలపడనున్నారు. ఆ సమయంలో మైదానంలో ఎదురుపడినప్పుడు తన తమ్ముడి బ్యాట్ కోరికను సంజు శాంసన్ కచ్చితంగా తీరుస్తాడని క్రికెట్ ప్రియులు భావిస్తున్నారు. అంతకంటే ముందుగా, సంజు తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి భారత్‌కు వరల్డ్ కప్ అందించాలని వైభవ్ కూడా కోరుకుంటున్నాడు.

సంజు శాంసన్ కేరళ నుంచి వచ్చి భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఆటతీరు యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తోంది. వైభవ్ సూర్యవంశీ లాంటి వర్ధమాన క్రికెటర్లకు సంజు ఒక మార్గదర్శిలా నిలుస్తున్నాడు. సంజు 97 పరుగుల ఇన్నింగ్స్ వెనుక గంభీర్ వ్యూహం ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు తమ్ముళ్ల అభిమానం సంజుకు కొండంత బలాన్నిస్తోంది. సెమీఫైనల్లో కూడా సంజు తన ఎక్స్‌ట్రా స్పెషల్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడని ఆశిద్దాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర