AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

నిర్మాత జీ.వి. నారాయణరావు సారధి స్టూడియోస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ కారణంగా హైదరాబాద్‌కు ఇండస్ట్రీ తరలిరావడంతో సారధి స్టూడియోస్ ఏర్పడిందని ఆయన వివరించారు. నవయుగ ఫిలిమ్స్ సారధి స్టూడియోస్ వాటాలను కొనుగోలు చేసిందని, కుటుంబ విభేదాల వల్ల చివరకు స్టూడియోను అమ్మేయాల్సి వచ్చిందని నారాయణరావు పేర్కొన్నారు.

Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..
Gv Narayana Rao
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2026 | 5:28 PM

Share

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా ప్రేక్షకులను అలరించారు నటుడు జి.వి నారాయణ రావు. 1976లో అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమీర్‌పేట, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ స్థలం గతంలో సారధి స్టూడియోస్‌కు చెందినదని, దీని ప్రస్తుత విలువ వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నారాయణరావు తండ్రి నవయుగ ఫిలిమ్స్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో భాగస్వామిగా ఉన్నారని, అప్పట్లో నవయుగ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా ఉండేదని వివరించారు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడం సారధి స్టూడియోస్ ఏర్పాటుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా దీనికి తోడైందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

అయితే, నాగేశ్వరరావు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనకు స్టూడియో సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో, చల్లపల్లి మహారాజా (చల్లపల్లి రామకృష్ణ ప్రసాద్)కు చెందిన సారధి బ్యానర్‌ను ఉపయోగించుకోవలసి వచ్చిందని నారాయణరావు చెప్పారు. నవయుగ ఫిలిమ్స్ సారధి స్టూడియోస్‌లో 45 శాతం వాటాలను కొనుగోలు చేసిందని, దీనితో తన తండ్రి 1964లో గుంటకల్ నుండి హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో నిర్వహణ బాధ్యతలను తీసుకున్నారని వివరించారు. సారధి స్టూడియోస్ మొదట్లో ఒకే ఫ్లోర్‌తో ప్రారంభమై, తరువాత మూడు ఫ్లోర్‌లకు విస్తరించి, అద్భుతంగా నడిచిందని తెలిపారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఉన్న ప్రాంతం కూడా సారధి స్టూడియోస్ గేటుగా ఉండేదని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

నవయుగ ఫిలిమ్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, కుటుంబ సభ్యుల మధ్య వాటాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తరాల వారీగా తలెత్తిన అభిప్రాయ బేధాలు, తర్వాతి తరం వారు సినీ రంగం నుండి ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోవడంతో స్టూడియోను విక్రయించాల్సి వచ్చిందని నారాయణరావు వివరించారు. వాహినీ, ఏవిఎం వంటి పెద్ద స్టూడియోలు కూడా ఇదే తరహా సమస్యలను ఎదుర్కొన్నాయని ఉదాహరణగా చెప్పారు. 1964లో కొనుగోలు చేసిన ఈ ఆస్తిని 1980వ దశకం (సుమారు 1984)లో కోట్లకు విక్రయించారని, ప్రస్తుతం దాని విలువ వేల కోట్లకు చేరిందని నారాయణరావు అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

Follow Us