AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ చూశారా?
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగించారు. ఈ మేరకు ఈఏపీసెట్ దరఖాస్తు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్ మోహన్‌రావు సోమవారం (మార్చి 2) వెల్లడించారు..

అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగించారు. ఈ మేరకు ఈఏపీసెట్ దరఖాస్తు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్ మోహన్‌రావు సోమవారం (మార్చి 2) వెల్లడించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ క్రమంలో తాజాగా జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ తేదీని మార్చి 17, 2026 వరకు పొడిగించినట్లు ఎన్వీనర్ ప్రకటించారు. అంటే ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొవచ్చన్న మాట.
ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కన్వీనర్ స్పష్టం చేశారు. ఇక ఈఏపీసెట్ ఆన్‌లైన్ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఇందులోఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12 నుంచి 15 వరకు, 18న నిర్వహిస్తారు. ఇక వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2026.
- రూ 1000 ఆలస్య రుసుముతో: మార్చి 21 వరకు దరఖాస్తుకు అవకాశం.
- రూ.2000 ఆలస్య రుసుముతో: మార్చి 25 వరకు దరఖాస్తుకు అవకాశం.
- రూ.4000 ఆలస్య రుసుముతో: మార్చి 30 వరకు ఆవకాశం.
- రూ.10 వేల ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 03 వరకు అవకాశం.
- దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 4 నుంచి 6 వరకు.
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 28 నుంచి
- ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల తేదీ: మే 23, 2026.
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 1, 2026.
ఏపీ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




