Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి నటిగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ హీరో పగబట్టి మరీ ఆమె కెరీర్ నాశనం చేశారు. కట్ చేస్తే.. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..

మలయాళం సినీరంగంలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ గా ఫేమస్ అయిన ఈ వయ్యారి.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగా జరిగన ఓ సంఘటన ఆమె జీవితాన్ని తారుమారు చేసింది. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక దాడికి పాల్పడేలా చేశాడు. ఈఘటన అప్పట్లో సంచలనంగా మారింది. కట్ చేస్తే.. ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ భావన. ఒంటరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన మహాత్మా మూవీతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో భావనకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన భావన.. తన 22 ఏళ్ల కెరీర్ లో తెలుగులో కేవలం నాలుగు సినిమాల్లోనే నటించింది.
2002లో మలయాళంలో నమ్మల్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది భావన. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 2008లో గోపిచంద్ సరసన ఒంటరి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు మూవీలో కనిపించింది. ఇప్పటివరకు భావన మొత్తం 70 సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో మాత్రం నాలుగు సినిమాల్లోనే నటించింది.
చేతినిండా సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని ఘటనతో ఆమె కెరీర్ నాశనమయ్యింది. 2017లో ఆమె ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక మలయాళీ సూపర్ టార్ దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దిలీప్ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే విషయాన్ని భావన తన భార్యకు చెప్పిందని.. అదే కోపంతో దిలీప్ ఆమెను కిడ్నాప్ చేయించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసుపై ఎలాంటి తీర్పు రాలేదు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన.. 2018లో మలయాళీ నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :