Tollywood: ఇదేంది మావా.. అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. సినిమాలు మానేసిన తగ్గని ఫాలోయింగ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అదే క్రేజ్ కొనసాగించలేకపోయారు. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించి విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుని..ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

తెలుగు సినీరంగంలో ఫస్ట్ మూవీతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో యువతను కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా నెట్టింట ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి… కామ్నా జెఠ్మలానీ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. గోపిచంద్ నటించిన రణం సినిమాతో కథానాయికగా అలరించింది.
ఒకప్పుడు తెలుగులో యూత్ ఫెవరేట్ క్రష్. రింగుల జుట్టు.. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది. తెలుగులో చేసింది తక్కు వ సినిమాలే అయిన ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రణం సినిమాతో ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన బెండప్పారావు చిత్రంలో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. దీంతో నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యూలర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. అయితే అప్పటికీ ఇప్పటికీ కామ్నా జెఠ్మాలానీ ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ అదే అందంతో నెటిజన్లకు షాకిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :








