AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇప్పుడు భారతీయ సినిమాల్లో సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ బ్యా్క్ టూ బ్యాక్ చిత్రాలతో అలసిస్తున్నారు. ఓవైపు యంగ్ హీరోలు కొత్త కొత్త కథలతో అడియన్స్ ముందుకు వస్తుండగా.. సీరియర్ స్టార్స్ మాత్రం అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఈ మూవీ చాలా స్పెషల్.

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Kabali Movie
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2025 | 4:43 PM

Share

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్స్ సత్తా చాటుతున్నారు. 60 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాల్లో సీనియర్ హీరోలు.. యంగ్ హీరోలతో రొమాన్స్ చేయడం కొత్తేమి కాదు.. కానీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. మరికొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో కనిపించిన హీరోయిన్ వయసు కేవలం 29 ఏళ్లు కాగా.. హీరో వయసు మాత్రం 65 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య 35 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ వీరిద్దరు కలిసి నటించిన సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా.. ? అదే కబాలి. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో ఈ మూవీ రికార్డ్స్ సృష్టించింది.

2016లో విడుదలైన కబాలి చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళైపులి ఎస్.థాను నిర్మించారు. కబాలి అనే వయసు పైబడిన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలు నుంచి విడుదలైన తర్వాత తన శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా. అదే సమయంలో చనిపోయారనుకున్న తన భార్య, కూతురి కోసం వెతకడం.. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. ఈ చిత్రంలో రజినీ భార్యగా కుముదవల్లి పాత్రలో హీరోయిన్ రాధికా ఆఫ్టే నటించింది. ఈ సినిమాలో నటించే టైంకు రాధిక వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే.

తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా 8 వేల నుంచి 10వేల స్క్రీన్ లలో విడుదలై రికార్డ్స్ సృష్టించింది. అమెరికాలోని 480 స్క్రీన్లలో, మలేషియాలో 490 స్క్రీన్ లలో.. గల్భ్ దేశాల్లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో రజినీ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో కబాలి ఒకటి.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో