AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కృష్ణంరాజు చేయాల్సిన మూవీ.. పట్టుబట్టి చిరుతో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేక్

"పసివాడి ప్రాణం" సినిమా చిరంజీవితో తీయడానికి నిర్మాత జీవీ నారాయణరావు ఎలా పట్టుబట్టారోనన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాటలు లేవని మొదట చిరంజీవి ఆసక్తి చూపించలేదని.. కృష్ణంరాజు హీరోగా సినిమా ప్రారంభమైంది. నారాయణరావు పట్టుదలతో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: కృష్ణంరాజు చేయాల్సిన మూవీ.. పట్టుబట్టి చిరుతో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేక్
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Mar 02, 2026 | 1:33 PM

Share

“పసివాడి ప్రాణం” సినిమా చిరంజీవితో తీయడానికి నిర్మాత జీవీ నారాయణరావు ఎలా పట్టుబట్టారోనన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాటలు లేవని మొదట చిరంజీవి ఆసక్తి చూపించలేదని.. కృష్ణంరాజు హీరోగా సినిమా ప్రారంభమైంది. నారాయణరావు పట్టుదలతో అల్లు అరవింద్ జోక్యం చేసుకుని చిరంజీవితో సినిమాను పూర్తి చేయించారు. వివరాల్లోకి వెళ్తే..! నటుడు, నిర్మాత జీవి నారాయణరావు చిరంజీవితో తన స్నేహాన్ని, “పసివాడి ప్రాణం” సినిమా వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నారాయణరావు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ పెళ్లిళ్లు, వారి తొలి సంతానం ఒకే సమయంలో జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు. “పసివాడి ప్రాణం” అనేది మలయాళ చిత్ర రీమేక్ అని, దాని హక్కులను నారాయణరావు కొనుగోలు చేశానని తెలిపారు.

చిరంజీవి ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే, థ్రిల్లర్ కావడంతో పాటలు లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆదరించరని చిరంజీవి తొలుత ఆసక్తి చూపలేదు. చిరంజీవి “చక్రవర్తి” షూటింగ్ కోసం బొంబాయి వెళ్లారు. ఈలోగా, తన రీమేక్ హక్కుల గురించి తెలియకుండానే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా అదే చిత్రాన్ని ప్రారంభించారని నారాయణరావు వివరించారు. వెంటనే ఆయన అల్లు అరవింద్‌ను సంప్రదించారు. చిరంజీవికి ఆసక్తి లేదని అరవింద్ అన్నప్పటికీ, ఈ సినిమాను చిరంజీవి గారే చేయాలని నారాయణరావు పట్టుబట్టారు. అరవింద్ జోక్యంతో కృష్ణంరాజు సినిమా ఆగిపోయింది. అనంతరం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “పసివాడి ప్రాణం” సినిమా తిరిగి ప్రారంభమైంది. ఒరిజినల్ చిత్రంలో పాటలు లేనప్పటికీ, “పసివాడి ప్రాణం”లో ఆరు పాటలను చేర్చి, దీన్ని ఒక కమర్షియల్ హిట్ చిత్రంగా మార్చారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ రికార్డులను సృష్టించిందని నారాయణరావు తెలిపారు.

Follow Us