ప్రొద్దుటూరుకు చెందిన ఓ తొమ్మిదో తరగతి బాలుడు తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రంతా 100 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ నంద్యాల చేరుకున్నాడు. అక్కడి నుంచి రాయచూరుకు వెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి, బాలుడిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. చిన్న విషయానికే బాలుడి ఈ సాహసం స్థానికంగా చర్చనీయాంశమైంది.