జబర్దస్త్‏లో యాంకర్‏గా ఛాన్స్.. అందుకే వదిలేశా.. బిగ్ బాస్ బ్యూటీ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

16 April 2026

బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ బ్యూటీ దివి వడ్త్యా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన అందం, అభినయంతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్' గురించి ఒక విషయాన్ని వెల్లడించింది.

నిజానికి 'జబర్దస్త్' అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనసూయ భరద్వాజ్. ఈ షో ద్వారానే ఆమె స్టార్ యాంకర్‌గా ఎదిగింది. కానీ ఆమె కంటే ముందే ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చిందట. 

ఈ షో ప్రారంభం కాకముందు మేకర్స్ దివిని సంప్రదించారట. అప్పట్లో మోడలింగ్ రంగంలో ఉన్న దివిని చూసి, జబర్దస్త్ హోస్ట్‌గా సరిగ్గా సరిపోతుందని టీమ్ భావించింది.

కానీ కొన్ని కారణాల వల్ల దివి ఆ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ ఆఫర్ వచ్చిన సమయంలో దివి తన చదువుపై దృష్టి సారించానని తెలిపింది.

అప్పట్లో ఆమె ఎంబీఏ (MBA) చదువుతుండటంతో, షూటింగ్స్ కోసం సమయం కేటాయించడం సాధ్యం కాలేదని ఆమె తెలిపింది. చదువును మధ్యలో ఆపడం ఇష్టం లేక ఆఫర్ వదిలేసిందట.

జబర్దస్త్ ఛాన్స్ మిస్ అయినా, 'బిగ్ బాస్' సీజన్ 4 ద్వారా దివి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ప్రవర్తన, మాటతీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఆ పాపులారిటీతోనే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా గడుపుతోంది.