AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..

డిస్కో శాంతి తమ భర్త శ్రీహరి గారి అంకితభావం, సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మగధీర సినిమాలో శ్రీహరి పాత్రకు ఎస్.ఎస్. రాజమౌళి గారు ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు. అంతేకాకుండా, రామ్ చరణ్ కోసం శ్రీహరి ఆయనకు ఎలా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారో వివరించారు.

Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2026 | 11:30 PM

Share

దివంగత నటుడు శ్రీహరి సతీమణి, ప్రముఖ నటి డిస్కో శాంతి తమ జీవితం, శ్రీహరి సినీ ప్రస్థానం గురించి పలు కీలక విషయాలను ఇటీవల పంచుకున్నారు. తమ వివాహం సమయంలో చాలా మంది శ్రీహరిని పెళ్లి చేసుకుంటే పేరు చెడిపోతుందని హెచ్చరించినప్పటికీ, తాను శ్రీహరిని దృఢంగా నమ్మి, ఆయన ఏది పెడితే అది తింటానని చెప్పి పెళ్లి చేసుకున్నానని శాంతి వివరించారు. తమ బంధంపై ఎవరైనా ఏమైనా చెబితే, ఆ మాటలను శ్రీహరితో పంచుకుని ఇద్దరూ నవ్వుకునేవారమని తెలిపారు. శ్రీహరి సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డారో డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. తాజ్ మహల్ సినిమాలో శ్రీకాంత్ సంబంధించిన ఒక చిన్న పాత్ర కోసం శ్రీహరి మూడవ ఆప్షన్‌గా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి, అప్పటి నిర్మాత డి. రామానాయుడు దగ్గరికి వెళ్లి, ఆ గెటప్‌కు అవసరమైన మేకప్, వస్తువులను గంటలోనే స్వయంగా కొనుక్కొచ్చి, తన గెటప్‌ను చూపించి ఆ పాత్రను సంపాదించుకున్నారని వివరించారు.

ఆ సమయంలో చాలా మంది కో-డైరెక్టర్లు శ్రీహరికి అండగా నిలిచారని, సార్ ఈ వేషం వేయండి, శ్రీహరి డైలాగ్స్ బాగా చెప్తారు, మంచి ఫిజిక్ ఉందని దర్శకులకు, హీరోలకు చెప్పి ప్రోత్సహించారని తెలిపారు. ఎన్. శంకర్, సురేష్, శారద వంటి అప్పటి కో-డైరెక్టర్లు చాలా మంది తమ భర్తకు సహాయపడ్డారని, శ్రీహరి హీరో అయిన తర్వాత వారికి అవకాశాలు కల్పించారని గుర్తుచేసుకున్నారు. శ్రీహరి నటించిన చిత్రాలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డి, భద్రాచలం వంటి చిత్రాలు తనకు బాగా ఇష్టమని డిస్కో శాంతి వెల్లడించారు.

మగధీర సినిమాలో మహేంద్ర బాహుబలి పాత్ర గురించి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో శ్రీహరి హీరోగా బిజీగా ఉన్నారని, మొదట సపోర్టింగ్ పాత్రలు చేయడానికి తాను అంగీకరించలేదని చెప్పారు. అయితే, ఎస్.ఎస్. రాజమౌళి గారు స్వయంగా ఇంటికి వచ్చి కథ చెప్పి శ్రీహరిని ఒప్పించారని తెలిపారు. రాజమౌళి అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ, ఆయన ఎవరినీ మోసం చేయరని, ఆ పాత్ర ప్రాముఖ్యతను తర్వాత తాను సినిమా చూశాక అర్థం చేసుకున్నానని శాంతి చెప్పారు. ఆ పాత్ర లేకపోతే మగధీర సినిమానే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. షూటింగ్ సమయంలో శ్రీహరి ఆరోగ్యం బాగోలేనప్పటికీ, రాజమౌళి, ఆయన సతీమణి రమ శ్రీహరిని దగ్గరుండి బాగా చూసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. మగధీర చిత్రాన్ని ఇప్పటికీ వందలాది సార్లు చూశానని, ముఖ్యంగా గుర్రంపై వచ్చే మహేంద్ర సన్నివేశం, షేర్ ఖాన్ పరిచయం, చివరిలో మళ్లీ పుడతావురా భైరవ అనే డైలాగ్ తనకు ఎంతో ఇష్టమని వివరించారు.

రామ్ చరణ్ శిక్షణ గురించి చిరంజీవి స్వయంగా ఆడియో ఫంక్షన్ లో చెప్పిన విషయాన్ని డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. మగధీర కోసం చరణ్ ను శ్రీహరి వద్దకు శిక్షణ కోసం పంపించారని, శ్రీహరిని అడగడానికి చిరంజీవి సంశయించినా, శ్రీహరి చరణ్ ను తన బిడ్డలా చూసుకుంటానని చెప్పి శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. శ్రీహరి చరణ్‌కు జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్ నేర్పారని, రోజు ఉదయం 5 గంటలకే శ్రీహరి సిద్ధంగా ఉండి, 5:30 కి వచ్చే చరణ్ కు కఠినమైన శిక్షణ ఇచ్చారని వివరించారు. శ్రీహరి గారు ఉదయం 4:30 గంటలకే లేచి, పూజ చేసి, ఒక గంట పాటు కంపల్సరీ వ్యాయామం, వెయిట్ లిఫ్టింగ్, ట్రెడ్‌మిల్, అలాగే ఇంటి వెనుక ఉన్న కొండపై నడక వంటి కఠినమైన దినచర్యను పాటించేవారని డిస్కో శాంతి తెలిపారు. ఆయన అంత కఠినమైన శిక్షణ ఇవ్వడం వల్లనే చరణ్ మొదట కొన్ని రోజులు వచ్చి, ఆ తర్వాత రాలేదని సరదాగా చెప్పారు. శ్రీహరిని చరణ్ బాబాయ్ అని పిలుస్తారని కూడా తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Follow Us