AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుతున్న అతడు.. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లోకి రాకమందు ప్రసాద్ బెహారా షార్ట్మ్ ఫిల్మ్, సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా విరాజితతో అతడు చేసే సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరి జోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..
Prasad Behara
Rajitha Chanti
|

Updated on: Apr 13, 2026 | 11:41 AM

Share

యూట్యూబ్ షార్ట్ ఫిల్స్ ద్వారా పాపులర్ అయ్యి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నటుడు ప్రసాద్ బెహరా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, విరాజితతో సిరీస్ నిలిపివేత, యూట్యూబ్ కంటెంట్ సృష్టి ఎదుర్కొనే సవాళ్లపై పలు కీలక విషయాలను వెల్లడించారు. విరాజితతో హిట్ సిరీస్‌ను ఎందుకు నిలిపివేశారనే ప్రశ్నకు ప్రసాద్ బెహరా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడడం అలవాటుగా మారకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “విరాజిత లేకపోతే నేను లేనా” లేదా “ప్రసాద్ లేకపోతే ఆమె లేదా” అనే భావన రాకుండా ఉండేందుకే సిరీస్‌ను తాత్కాలికంగా ఆపేశామని చెప్పారు. ఆ సిరీస్‌కు విరాజిత కరెక్ట్ అని, భవిష్యత్తులో అవసరమైతే ఆమెను తిరిగి తీసుకుంటామని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

తన ప్రధాన లక్ష్యం డబ్బేనని ప్రసాద్ బెహరా కుండబద్దలు కొట్టారు. గతంలో డబ్బును తక్కువగా చూసిన తాను, ఇప్పుడు మరింత ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతూ, జీవితంలో దెబ్బలు తగులుతున్నప్పుడు పాఠాలు నేర్చుకునే అవకాశం కూడా లభించకుండానే మరో దెబ్బ తగులుతుందని ఆయన చెప్పారు. తాను ఎదుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారికి అసూయ కలగడం సాధారణమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

యూట్యూబ్‌లో వచ్చే కామెంట్ల గురించి ప్రస్తావిస్తూ, వాటికి తాను చాలా గౌరవం ఇస్తానని అన్నారు. ప్రేక్షకులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి వీడియో చూసి, కామెంట్లు పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నిర్మాణాత్మక విమర్శలు, సలహాలు (నటన, ఎడిటింగ్ మెరుగుదల వంటివి) తనకు ఎంతో సహాయపడతాయని, వాటి ఆధారంగా తాను సరిదిద్దుకుంటానని తెలిపారు. అయితే, బూతులు, వ్యక్తిగత దూషణలు, మహిళలను కించపరిచే కామెంట్లను మాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు. పెళ్లివారం సిరీస్‌లో విరాజిత పాత్ర ఎలా అభివృద్ధి చెందిందో వివరించడానికి పాజిటివ్ కామెంట్స్ పాత్రను ఉదాహరణగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!
20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు
20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు
పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?
పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?