AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

xతెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సినిమాలకు ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖడ్గం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2026 | 3:01 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినిమాల కాస్టింగ్ గురించి, ముఖ్యంగా నటి సోనాలి బింద్రే “మురారి” చిత్రంలో నటించిన అనుభవం గురించి వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజ, శ్రీకాంత్, నాగార్జున వంటి నటుల పేర్లు ఇతర పాత్రల ఎంపికకు సంబంధించి ప్రస్తావనకు వచ్చాయి. అయితే, కోటి అనే సినిమాలో హీరో కోసం మొదట ముగ్గురిని అనుకున్నట్లు కృష్ణవంశీ తెలిపారు. సోనాలి బింద్రే మురారి సినిమాలో ఎలా భాగమయ్యారనే ప్రశ్నకు కృష్ణవంశీ స్పందిస్తూ, “ఆమె చాలా మంచి వ్యక్తి” అని పేర్కొన్నారు. ఆ సమయంలో సోనాలి చిరంజీవి వంటి స్టార్లతో సినిమాలు చేస్తూ, నాగార్జునతో చర్చలు జరుపుతూ పెద్ద హీరోయిన్‌గా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. మురారి చిత్రంలో ఆమెకు కేవలం ఆరు, ఏడు రోజుల పని మాత్రమే ఉంటుందని, ఒక పాట, చనిపోయే పాత్ర అని వివరించారు. ఈ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని ఆమెకు చెప్పినప్పుడు, ఆమె వెంటనే అంగీకరించారని, “సరే ఓకే, వచ్చేస్తున్నాను” అని చెప్పారని కృష్ణవంశీ తెలిపారు. సోనాలి

ఖడ్గం సినిమా ప్రధాన పాత్ర కోసం శ్రీకాంత్ ని అనుకున్నప్పుడు, నిర్మాతల వైపు నుండి నాగార్జున ను తీసుకోవాలనే సూచన వచ్చిందని ఆయన తెలిపారు. ఒక పెద్ద స్టార్ నటుడిని తీసుకుంటే సినిమాకు మంచి బడ్జెట్ వస్తుందని నిర్మాతలు భావించారని అన్నారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ ఆలోచనను తిరస్కరించారు. నాగార్జున వంటి స్టార్ నటుడు వస్తే సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని, అంతేకాకుండా, సినిమాలో రెండు ముఖ్యమైన పాత్రలు ఉండటం వల్ల నాగార్జున స్టార్‌డమ్ ఆ పాత్రల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయన వివరించారు.

ఒక పాత్ర హీరోలా, మరో పాత్ర హీరో స్నేహితుడిలా కనిపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. నాగార్జున సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు, ఆ చిత్రాలకు ఉండే ప్రత్యేకతలను ఖడ్గం సినిమాలో ఇవ్వలేమని కృష్ణవంశీ స్పష్టం చేశారు. అందువల్ల, నాగార్జునను కాకుండా శ్రీకాంత్ నే ఆ పాత్రకు ఎంపిక చేయడం సరైందని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం బడ్జెట్ అంచనాల గురించే జరిగిన చర్చ తప్ప, పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

Follow Us