AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు డెకాయిట్ మూవీతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Apr 08, 2026 | 1:35 PM

Share
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా డెకాయిట్. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి స్టార్లు హాజరై చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు.

1 / 5
ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్‌ను తన "లక్కీ చార్మ్" అని అన్నారు. "ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఒక నటిగా ఉన్నానంటే దానికి కారణం ఆయనే" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ ఆరంభంలో రణ్‌వీర్‌తో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో నటించానని అన్నారు.

2 / 5
ఆ యాడ్ చూసిన తర్వాతే సినీ నిర్మాతలు తనను గుర్తించి అవకాశాలు ఇచ్చారని ఆమె వెల్లడించారు. రణ్‌వీర్ ఎంతో పాజిటివ్ వ్యక్తి అని, ఆయనకు దక్కుతున్న ఈ విజయం పూర్తిగా ఆయన కష్టానికి దక్కిన ఫలితమని చెప్పుకొచ్చారు. 'ధురంధర్ 2' సినిమాలో రణ్‌వీర్ నటన గురించి చెబుతూ.. "సినిమా చూస్తున్నంత సేపు నాకు అక్కడ రణ్‌వీర్ కనిపించలేదని తెలిపారు.

3 / 5
 కేవలం 'హమ్జా' అనే పాత్ర మాత్రమే కనిపించింది. తన నటనలో ఎన్నో లోతైన కోణాలు ఉన్నాయి. ఒక హీరోలా కాకుండా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. హిందీలో పలు చిత్రాల్లో నటించింది మృణాల్.

4 / 5
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 'ధురంధర్ 2' మానియా నడుస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇందులో సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ క్రమంలోనే మృణాల్ రణవీర్ సింగ్ తో తన అనుబంధం గురించి వెల్లడించింది.

5 / 5
Follow Us