AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడికి మరింత బలం.. ఈ రాశుల వారికి ఆదాయం, అధికార యోగం..!

Saturn and Jupiter Aspect: నవంబర్ 12, 13, 14 తేదీల్లో అరుదైన గ్రహ వీక్షణలు చోటుచేసుకోనున్నాయి. రెండు ప్రధాన గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఈ మూడు రోజుల్లో ఎలాంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ఏయే రాశుల జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి?

చంద్రుడికి మరింత బలం.. ఈ రాశుల వారికి ఆదాయం, అధికార యోగం..!
Saturn And Jupiter Aspect
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 11, 2026 | 5:46 PM

Share

Telugu Astrology: రెండు ప్రధాన గ్రహాలైన శని, గురువులు ఈ నెల(నవంబర్) 12, 13, 14 తేదీల్లో ధనూ రాశిలో ఉన్న చంద్రుడిని వీక్షించడం జరుగుతోంది. శని కూడా గురువు స్థానమైన మీన రాశిలో ఉన్నందువల్ల ఈ వీక్షణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వీక్షణలతో చంద్రుడికి మరింతగా బలం పెరిగి, మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు విజయాలు, సాఫల్యాలు లభిస్తాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. తప్పకుండా ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడిని శని, గురువులు వీక్షించడం వల్ల ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక, ఆస్తి వివాదాలు సానుకూలంగా సమసిపోతాయి. ఆస్తిపాస్తులు, పిత్రార్జితం కలిసి వస్తాయి. లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. అత్యంత ప్రముఖులతో స్నేహ సంబంధాలు బాగా సన్నిహితమవుతాయి.
  2. మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడికి శని, గురువుల దృష్టితో బలం పెరిగినందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో మీ ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సమస్యలు పరిష్కా రమై, సామరస్యం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగు లకు కొత్త ఆఫర్లు అందుతాయి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి.
  3. సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడిని ఈ రాశి నుంచి గురువు, అష్టమ స్థానం నుంచి శని వీక్షించడం వల్ల విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
  4. తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడిని శని, గురువులు వీక్షించడం అత్యంత యోగ దాయకం. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. ఆస్తి, గృహ సంబంధమైన ఒప్పందాలకు ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శక్తిసామర్థ్యాలు బాగా రాణిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి గురువు, ధనాధిపతి శని వీక్షించడం వల్ల ప్రతి ప్రయ త్నమూ విజయవంతం అవుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. ప్రముఖులతో లాభసాటి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో నైపుణ్యాల వల్ల లాభపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  7. కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి శని, గురువు చూడడం వల్ల అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధి కారులు లబ్ధి పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Follow Us