కార్తీక మాసంలో దీపం వెలిగిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే కష్టాల పాలే!

samatha

11 November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం వచ్చేసింది. శివకేశవుల భక్తులు ఎంతగానో ఎదురు చూసే మాసం ఈ కార్తీక మాసం.

కార్తీక మాసం

కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని పూజించడమే కాకుండా, నది స్నానం చేస్తుంటారు. అలాగే నిత్యం శివుడిని పూజిస్తారు. దీపాలు వెలిగిస్తారు.

శివ పూజ

ముఖ్యంగా కార్తీక దీపం వెలిగించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. లేకపోతే కష్టాలు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

కార్తీక దీపం

కాగా, ఇప్పుడు మనం అసలు, కార్తీక దీపం వెలిగించే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

చేయకూడని తప్పులు

కార్తీక దీపాన్ని ఎప్పుడూ కూడా నేరుగా నేలపై పెట్టకూడదు. ప్లేట్ లేదా  బియ్యం, ముగ్గు, తమలపాకులపై పెట్టడం మంచిది.

నేలపై పెట్టకూడదు

అదే విధంగా, వాస్తు ప్రకారం కార్తీక దీపం ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం దిశవైపు పెట్టడం చాలా శ్రేయస్కరం.

వాస్తు

అలాగే కొంత మంది నూనె, నెయ్యి లేదా రకరకాల నూనెలతో వెలిగిస్తారు. కానీ అలా కాకుండా, ఒకేరకమైన దానితో మాత్రమే దీపం వెలిగించాలంట.

ఒకే రకం

 అంతే కాకుండా ఎప్పుడూ కూడా ఒక దీపంతో మరో దీపం వెలిగించకూడదు దీని వలన కష్టాలు ఎదుర్కొంటారంట.

కష్టాలు