AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Blessings: శుక్రుడి అనుగ్రహం.. ఈ 4 రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో భారీ లాభాలు!

Venus Direct 2026: జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఒక గ్రహం వక్రగతి నుంచి మార్గగతిలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన అంశాల్లో మార్పులు సంభవిస్తాయి. శుక్రుడి విషయంలో ప్రేమ సంబంధాలు, దాంపత్య జీవితం, ధన సంపదలు, విలాసవంతమైన సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తారు. ప్రస్తుతం వక్రగతిలో ఉన్న శుక్రుడు నవంబర్ 14, 2026న తిరిగి మార్గంలోకి రాబోతున్నాడు. ఈ గ్రహ సంచార మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది.

Janardhan Veluru
|

Updated on: Nov 11, 2026 | 1:12 PM

Share
జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శుక్రుడిని ప్రేమ, వైవాహిక జీవితం, సిరిసంపదలు, విలాసాలు, భౌతిక సుఖాలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడి స్థానం, గ్రహ సంచారం ఆధారంగా ఈ అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వక్రగతిలో ఉన్న శుక్రుడు నవంబర్ 14, 2026న తిరిగి మార్గంలోకి రాబోతున్నాడు. ఈ గ్రహ సంచార మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు కలిగించే అవకాశముంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 5
మేష రాశి (Aries): శుక్ర మార్గి సంచారం మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశముంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కార్యాలయంలో చేసే పనులకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాల్లో ఉన్నవారికి కొత్త లాభదాయక అవకాశాలు ఏర్పడుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు పొదుపు చేసుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

2 / 5
కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారు కెరీర్, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబ అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతారు.

3 / 5
తులా రాశి (Libra): తులా రాశికి శుక్రుడు అధిపతి కావడంతో ఈ గ్రహ సంచార మార్పు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరగడంతో పాటు ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.

4 / 5
కుంభ రాశి (Aquarius): శుక్ర మార్గి కుంభ రాశి వారికి కెరీర్‌లో పురోగతికి దోహదపడే అవకాశముంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్ద ఒప్పందాల ద్వారా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని అంశాలను పరిశీలించడం మంచిది. (గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా ఇచ్చినవి. ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. వీటిని కచ్చితమైన భవిష్యవాణిగా భావించకూడదు)

5 / 5
Follow Us