AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్ను బలవనతంగా ఎవరు నటించమన్నారు..? ఆ హీరోయిన్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు

తెలుగు సినిమాలో బాలకృష్ణతో సహా వయసైన హీరోలతో నటించడం, మేనరిక వివాహాలపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని తెలిపారు.

నిన్ను బలవనతంగా ఎవరు నటించమన్నారు..? ఆ హీరోయిన్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
Thammareddy Bharadwaj
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2026 | 3:02 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాధికా ఆప్టే మధ్య ఇటీవల రేగిన వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. నటి రాధికా ఆప్టే ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల్లో మేనరిక వివాహాలు, అలాగే వయసైన హీరోలతో నటించడంపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో, సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. నటీనటులు ఏ సినిమానైనా అంగీకరించే ముందు కథను పూర్తిగా వింటారని, హీరో ఎవరు, తన పాత్ర స్వభావం ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటారని స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరూ సినిమాలను చేయరని, ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా పాత్ర నచ్చితేనే నటిస్తారని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, డబ్బులు తీసుకున్న తర్వాత, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అన్ ప్రొఫిషనల్ అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

రాధికా ఆప్టే గతంలో బాలకృష్ణతో లయన్, లెజెండ్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ఆమె బాలకృష్ణ నటనను, సహకారాన్ని గొప్పగా ప్రశంసించారని, ఇప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం “రెండు నాలుకలు” ప్రవర్తన వంటిదని విమర్శించారు. ఒకవేళ ఆమెకు నచ్చకపోతే, మొదటి సినిమా తర్వాత రెండో సినిమాను చేయాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి అన్నారు. తెలుగు సంస్కృతిలో మేనరిక వివాహాలు సర్వసాధారణమని, ఇది ఉత్తర భారతదేశంలో భిన్నంగా ఉండవచ్చని ఆయన వివరించారు. సైన్స్ వీటిని ప్రోత్సహించకపోయినా, ఇది మన కల్చర్‌లో భాగమని, దానిని తప్పుబట్టడం సరికాదని తెలిపారు.

నటుల వయసు గురించి మాట్లాడుతూ, బాలకృష్ణ వంటి నటులు తమ వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మన్నన పొందుతారని, రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి వంటి దిగ్గజాలు కూడా వయసు పెరిగినా హీరోలుగా కొనసాగారని గుర్తుచేశారు. హీరోయిన్ల కెరీర్ వయసుతో ముగుస్తుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తల్లి, వదిన పాత్రలు వేసినంత మాత్రాన వారి కెరీర్ ముగిసినట్లు కాదని, వయసుకు తగిన పాత్రలు వస్తాయని అమితాబ్ బచ్చన్, హేమమాలిని వంటి వారిని ఉదాహరణగా చెప్పారు. నటీనటులు కథ నచ్చకపోతే, హీరో నచ్చకపోతే, మేనరికాలు లేదా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే సినిమాను తిరస్కరించే పూర్తి స్వేచ్ఛ ఉందని తమ్మారెడ్డి నొక్కి చెప్పారు.

బలవంతంగా ఎవరూ ఒప్పించరని, క్యారెక్టర్, రెమ్యూనరేషన్ నచ్చాకే నటిస్తారని తెలిపారు. “మీ టూ” ఉద్యమ సమయంలో కూడా రాధికా ఆప్టే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, పాత విషయాలను మళ్లీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. దక్షిణాది సినిమా మార్కెట్ గురించి మాట్లాడుతూ.. బాహుబలి తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమాకు అగ్రస్థానం లభించిందని, ఇది కేవలం ప్రాంతీయ మార్కెట్ కాదని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. బాలకృష్ణ అభిమానులు, అలాగే తెలుగు ప్రజలు తమ సంస్కృతి, నటులపై ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు సహజంగానే స్పందిస్తారని, వారి కోపాన్ని అర్థం చేసుకోవచ్చని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

Radhika Apte

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us