AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం.. ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. లేటెస్ట్ హెచ్చరికలు ఇవే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 16, 17 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఇది దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని అంటున్నారు.. అయితే తీరం దాటే సమయంలో దీని తీవ్రత తగ్గొచ్చని అంటున్నారు.

Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం.. ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. లేటెస్ట్ హెచ్చరికలు ఇవే..
Weather
Venkatrao Lella
|

Updated on: Nov 11, 2026 | 2:29 PM

Share

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 13, 2026 ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఆ తరువాత 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని తెలిపారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని వెల్లడించారు. ఈ వాయుగుండం  ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర లేదా ఉత్తర తమిళనాడు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

అయితే భూ ఉపరితలం నుంచి సముద్రం వైపు పొడి గాలులు వీస్తున్నందున ఇది తీరం దాటకముందే సముద్రంలో కొంత బలహీనపడవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫలితంగా ఇది తువాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది.కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో  ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  అలాగే రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది అమరావతి వాతావరణ కేంద్రము స్పష్టం చేసింది.

తెలంగాణ వాతావరణం

తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక పగటిపూట ఎండలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల పాటు ఎలాంటి వర్షసూచన వాతావరణశాఖ జారీ చేయలేదు. అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us