Tollywood : వేశ్య పాత్రలో కనిపిస్తా.. కానీ అలాంటి సీన్స్ మాత్రం ఉండవు..
అచ్చ తెలుగమ్మాయి.. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ షిప్ట్ అయ్యింది. తమిళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ క్రమంలోనే తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలుగు సినీపరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగమ్మాయి అయినప్పటీక ఒక్క సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇక కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ బిందు మాధవి. తెలుగు చిత్రపరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 15 ఏళ్లుగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బిందు మాధవి.. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ ఓటీటోలోకి అడుగుపెట్టి విజేతగా నిలిచింది. ఈ షోతో లేడీ సింగం అంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ షో తర్వాత సైతం తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. తాజాగా ఈ అమ్మడు ధండోరా అనే తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుందని సమాచారం. దాంతో ఈ మూవీపై నెట్టింట రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇందులో ఆమె పాత్ర బోల్డ్ సీన్స్ లో కనిపించనుందని.. కెరీర్ మొత్తంలో ఎప్పుడూ లేని విధంగా హద్దులు దాటి కనిపించేందుకు రెడీ అయ్యిందంటూ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది బిందు మాధవి టీం. ఈ చిత్రంలో తాను వేశ్య పాత్రలో కనిపించనున్నానని.. కానీ అందులో బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్ అస్సలు ఉందడని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల అడియన్స్ చూసేందుకు వీలుగా తెరకెక్కిస్తున్నారని టాక్.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బింధు మాధవి పాత్రలో ప్రధానంగా ఉండనుందని.. ఎక్కువగా భావోద్వేగాలను చూపించే కంటెంట్ ఉంటుందని.. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు మేకర్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




