AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఇరాన్ దెబ్బకు సామాన్యులకు పిడుగులాంటి వార్త.. దేశంలో పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం గత మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఖమేనీ మరణంతో యుద్దం మరింత ముదిరింది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖతార్ నుంచి భారత్ ఎక్కుగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది.

Gas Cylinder: ఇరాన్ దెబ్బకు సామాన్యులకు పిడుగులాంటి వార్త.. దేశంలో పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..!
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 1:43 PM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడుతోంది. పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండి ధరలతో పాటు ముడి చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడటం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చనే అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యులపై భారం పడే పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. యద్ద ప్రభావం పశ్చిమాసియా దేశాలపై కూడా పడింది. దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని వల్ల హార్ముజ్ జలసంధికి ముప్పు ఏర్పడటం వల్ల ఎల్‌పీజీ(LPG), ఎన్‌ఎన్‌జీ(LNG) సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ ప్రభావంతో ఎగుమతులకు ఆటంకం కలగనుండటంతో ఆసియాలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగొచ్చని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. యుద్దం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే గ్యాస్ ధరలు ఖరీదైనవిగా మారే అవకాశముంది.

సామాన్యులపై ప్రభావం

గతంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్‌తో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల గ్యాస్ ధరలు పెరిగాయి. దీని వల్ల అనేక దేశాలు ఇంధన కొరతను కూడా ఎదురొన్నాయి. ఇంధన సరఫరాకు మధ్యప్రాచ్యం చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో సహజ వాయువు, ఎన్‌ఎన్‌జీలోనే గణనీయమైన భాగం ఇప్పడినుంచే రవాణా అవుతుంది. ప్రపంచంలోనే ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఖతార్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ నుంచి అనేక ఆసియా దేశాలకు సరఫరా అవుతూ ఉంటుంది. చైనా, భారత్ వంటి దేశాలు ఖతార్ నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, గ్యాస్ సరఫరాలకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో భారత్‌లో గ్యాస్ ధరలు పెరగొచ్చని అంటున్నారు. ఇదే జరిగితే సామాన్యులపై భారం పడనుంది.

త్వరలోనే పెరిగే అవకాశం

భారత్ ఎక్కువగా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం భారత్‌లో గ్యాస్ నిల్వలు తక్కువగానే ఉన్నాయి. ఉద్రిక్తతలు త్వరగా పరిష్కారం కాకపోతే గ్యాస్ కొరత ఏర్పడే అవకాశముంది. దీన వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయి. ముడి చమురు ధరలతో గ్యాస్ ధరలు ఆధారపడి ఉంటాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు పెరిగితే గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ ధరలపై ఇది కూడా ప్రభావితం చూపవచ్చు. మార్చి1న కొత్త గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.30 మేర పెంచగా.. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను పెంచలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్దం ఆగకపోతే ధరలు పెరిగే అవకాశముంటుంది.

Follow Us