AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: అఖండ 2 తర్వాత బాలయ్య ఫుల్ మాస్ మోడ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న నటసింహం

Nandamuri Balakrishna: అఖండ 2 తర్వాత బాలయ్య ఫుల్ మాస్ మోడ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న నటసింహం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 28, 2026 | 4:26 PM

Share

అఖండ 2 తర్వాత బాలకృష్ణ పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK111 వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, కొరటాల శివ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలన్న లక్ష్యంతో బాలయ్య వరుస ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మాట చెప్పడం కాదు.. చెప్పిన మాటను చేసి చూపిస్తున్నారు బాలయ్య. ఈరోజు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మధ్యే మాట్లాడారు నటసింహం. దానికి పరిష్కారం కూడా ఆయనే చెప్పారు. ఈ దిశగా తొలి అడుగు బాలయ్యే వేస్తున్నారు. మరి అఖండ 2 తర్వాత బాలయ్యలో వచ్చిన మార్పులేంటి..? నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం చేయబోతున్నారు..? అఖండ 2 ఫ్లాప్ తర్వాత కమర్షియల్ డోస్ పెంచారు బాలయ్య. కొన్నాళ్లు ప్రయోగాలకి దూరంగా ఉండి.. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తానంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సైపోయారు. అన్నట్లుగానే తక్కువ గ్యాప్‌లోనే 2 సినిమాలతో రాబోతున్నారీయన. గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK111 షూటింగ్ వేగంగా జరుగుతుంది. పెద్ది నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నారు బాలయ్య. వీరసింహారెడ్డి కంటే మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు గోపీచంద్. ఇది సెట్స్‌పై ఉండగానే.. కొరటాల శివతో సినిమాకు కూడా సై అన్నారీయన. జూన్‌లో ఓపెనింగ్ చేసి.. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొరటాల కథలో కూసింత సందేశం కూడా ఉండబోతుంది. బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ పెడుతూనే.. తనదైన శైలిలో మెసేజ్ మిక్స్ చేస్తున్నారు కొరటాల శివ. 2027 సమ్మర్‌కు ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది. ఏదేమైనా అఖండ 2 తర్వాత ఓన్లీ మాస్ వైపే చూస్తున్నారు బాలయ్య. మాటిచ్చినట్లుగానే వేగంగా సినిమాలు కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

Published on: May 28, 2026 04:25 PM
Follow Us