టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం
2026 ప్రపంచ టెక్నాలజీ ర్యాంకింగ్స్‌లో దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సెమీకండక్టర్లు, 5జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆధిపత్యం కారణంగా అమెరికాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. తైవాన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ కూడా టాప్ స్థానాల్లో నిలిచాయి. టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఎంతగా వినియోగిస్తున్నారనే అంశమే ఈ ర్యాంకింగ్స్‌లో కీలకంగా మారింది.
సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల తాజా జాబితా విడుదలైంది. 2026 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన దేశాల ర్యాంకులను ‘వరల్డ్ అట్లాస్’ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆసియా దేశం దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టెక్ దిగ్గజం అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వేగం, పరిశోధన-అభివృద్ధి పెట్టుబడుల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. నివేదిక ప్రకారం, దక్షిణ కొరియా తన జీడీపీలో దాదాపు 5 శాతం నిధులను పరిశోధన-అభివృద్ధి కోసం కేటాయిస్తోంది. సెమీకండక్టర్లు, 5జీ, ఎలక్ట్రానిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అమెరికా ఏఐ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో దూసుకుపోతున్నా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అధునాతన చిప్‌ల తయారీ కేంద్రం తైవాన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యూరప్ దేశాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. పునరుత్పాదక ఇంధనంలో డెన్మార్క్ 4వ ర్యాంక్, ఫార్మాస్యూటికల్స్‌లో స్విట్జర్లాండ్ 5వ ర్యాంక్‌తో ముందున్నాయి. ఇక స్టార్టప్‌లకు, సైబర్ సెక్యూరిటీకి పెట్టింది పేరైన ఇజ్రాయెల్ ఆరో స్థానంలో నిలిచింది. ఆ దేశం తన జీడీపీలో 6 శాతానికి పైగా నిధులను పరిశోధన-అభివృద్ధి కోసం ఖర్చు చేయడం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్ , నెదర్లాండ్స్ , స్వీడన్ , నార్వే నిలిచాయి. టెలికాం, గేమింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఈ దేశాలు ముందున్నాయి. కేవలం ఆర్థిక పరిమాణం మాత్రమే కాకుండా, టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఎంతగా భాగం చేశారనే అంశం ఈ ర్యాంకుల్లో కీలక పాత్ర పోషించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్
ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..

