ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన
బెంగళూరులో కూరగాయలు అమ్మే ఓ యువకుడు తలపై ఐఫోన్ అమర్చిన ప్రత్యేక పరికరంతో ఏఐ కంపెనీల కోసం డేటా సేకరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గంటకు రూ.350 సంపాదిస్తున్నాడనే వార్త నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది. రోజువారీ పనితో పాటు అదనపు ఆదాయం సంపాదించే ఈ కొత్త విధానం టెక్ సిటీ బెంగళూరులో చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరుకు చెందిన కూరగాయలు అమ్మే ఓ కుర్రాడు సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాడు. తలపై ఐఫోన్, మెమొరీ కార్డ్ అమర్చిన ఒక వింత పరికరాన్ని పెట్టుకుని అతను కూరగాయలు అమ్ముతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టెక్ సిటీ బెంగళూరులో ఐటీ ఉద్యోగులకే కాదు, చిరువ్యాపారులకూ ఏఐ ఎంతలా కనెక్ట్ అయిందో ఈ ఘటన తెలియచేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ట్రైనింగ్ కోసం కంపెనీలు ఐఫోన్‌తో గ్రౌండ్ లెవెల్ డేటాను సేకరిస్తుంటాయి. ఆ కుర్రాడు తన రోజువారీ పని చేసుకుంటూనే.. ఈ హెడ్‌గేర్ ద్వారా నగర వీధుల్లోని వీడియో, ఆడియో, లొకేషన్ సమాచారాన్ని రికార్డ్ చేస్తూ కంపెనీలకు అందిస్తున్నాడు. ఈ కొత్త ప్రయత్నం ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నట్లు ఆ పోస్ట్‌లో తెలిపారు. ఆ లెక్కన రోజుకు 10 గంటలు పనిచేస్తే రూ.3,500.. అంటే నెలకు ఏకంగా రూ.1,05,000 వరకు సంపాదించొచ్చని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాదాసీదా కార్పొరేట్ ఉద్యోగుల కంటే ఈ కూరగాయల వ్యాపారే ఎక్కువ ఆర్జిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కొందరు దీన్ని అదనపు ఆదాయానికి చక్కని మార్గంగా అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం సంపాదన లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంటకు రూ.350 ఇస్తున్న మాట నిజమే అయినా.. ఈ ప్రాజెక్టులు కేవలం 10 నుంచి 20 గంటల పనితోనే ముగిసిపోతాయని, నెలంతా ఇలాంటి ఆదాయం రావడం సాధ్యం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

