AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Phani CH
|

Updated on: May 28, 2026 | 3:42 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ కుటుంబం 16 ఏళ్లుగా పెంచుకుంటున్న ‘టింకు’ అనే నాటు కోడిపుంజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కోళ్లు ఎక్కువకాలం జీవించకపోయినా, ప్రేమతో కూడిన సంరక్షణ వల్ల టింకు ఈ వయసు వరకు బతికిందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి సభ్యుడిలా మారిన ఈ కోడిపుంజుపై ఆ కుటుంబం చూపిస్తున్న మమకారం అందరినీ ఆకట్టుకుంటోంది.

కొందరికి పెంపుడు జంతువులు, పక్షులంటే ప్రాణం. వాటిని కేవలం మూగజీవాలుగా కాకుండా, తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. సరిగ్గా అలాంటి అపురూపమైన బంధమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో వెలుగుచూసింది. సాధారణంగా కోడిపుంజు ఆయుష్షు ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. కానీ, ఇక్కడి చెన్ను ప్రవీణ్, శైలజ దంపతుల ఇంట్లో ఓ నాటు కోడిపుంజు ఏకంగా 16 ఏళ్లుగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘జీవవైవిధ్య దినోత్సవం’ సందర్భంగా ఈ విచిత్ర సంఘటన బయటకు వచ్చింది. ఈ కోడిపుంజు పేరు ‘టింకు’. ప్రవీణ్ కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పటి నుంచి ఈ టింకు వారి ఇంట్లో పెరుగుతోంది. ప్రస్తుతం దీని వయసు 16 సంవత్సరాలు. కేవలం సజ్జలు మాత్రమే ఆహారంగా తీసుకునే ఈ టింకు, గత రెండేళ్లుగా ఇంట్లో పెరుగుతున్న ‘లియో’ అనే జాతి కుక్కతో ఎంతో స్నేహంగా ఉంటోంది. ఈ ఎండాకాలంలో ఈ రెండు మూగజీవాలు కూలర్ కింద సేదదీరుతూ ఆడుకోవడం విశేషం. టింకు తమ కుటుంబంలో ఒక భాగమైపోయిందని, వయసు పైబడుతుండటంతో రాబోయే రోజుల్లో దాని పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రవీణ్ కుటుంబం ఆందోళన చెందుతోంది. సాధారణంగా కోళ్లు ఎక్కువ కాలం బతకవు. అయితే, నాణ్యమైన ఆహారం, సరైన సంరక్షణతోపాటు కుటుంబ సభ్యుల ప్రేమ ఉంటే కోడిపుంజులు పదిహేనేళ్ల పైగా జీవించే అవకాశం ఉందని జిల్లా పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ‘టింకు’పై ఆ కుటుంబం చూపిస్తున్న మమకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన

Follow Us