AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ పవర్ కాదు.. ఇప్పుడు ప్యాన్ ఇండియాను శాసించేది కాన్సెప్ట్‌లే

స్టార్ పవర్ కాదు.. ఇప్పుడు ప్యాన్ ఇండియాను శాసించేది కాన్సెప్ట్‌లే

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 28, 2026 | 4:22 PM

Share

ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలంటే కేవలం స్టార్ పవర్ సరిపోదని, బలమైన కాన్సెప్ట్ తప్పనిసరి అని టాలీవుడ్ హీరోలు నమ్ముతున్నారు. ప్రభాస్ ‘ఫౌజీ’, అల్లు అర్జున్ ‘రాకా’, రామ్ చరణ్ ‘పెద్ది’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వంటి సినిమాలు భారీ కథాంశాలతో తెరకెక్కుతున్నాయి. భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌పైనే ఇప్పుడు స్టార్ హీరోలు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మెప్పించాలంటే కమర్షియల్ కథకు స్టార్ పవర్ తోడైతే సరిపోతుంది.. కానీ ప్యాన్ ఇండియన్ వైడ్‌గా బాక్సాఫీస్ మోత మోగాలంటే కరెక్ట్ కాన్సెప్ట్ ఉండాల్సిందే. అందుకే కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు స్టార్ హీరోలు. దేశాన్ని మెప్పించడానికి కమర్షియల్ కాదు.. కాన్సెప్ట్ ముఖ్యం బిగిలూ అంటున్నారు. ఆ కాన్సెప్ట్ కహానీ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? కాన్సెప్ట్ లేకుండా సినిమాలే చేసేది లేదంటున్నారు మన హీరోలు. ప్యాన్ ఇండియన్ అప్పీల్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే అనేది వాళ్ల వాదన. ఏ హీరోను తీసుకున్నా అదే చేస్తున్నారు. ప్రభాస్‌ను చూస్తే.. ఫౌజీ కథ చాలా పెద్దది.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కాన్సెప్ట్ ఇది. హను రాఘవపూడి దీన్ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. స్పిరిట్‌లో అసలైన పోలీస్ అధికారి ఎలా ఉంటాడో చూపిస్తానంటున్నారు సందీప్ వంగా. ఇందులో ఖాకీ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నారు రెబల్ స్టార్. అల్లు అర్జున్ రాకా సైతం కమర్షియల్ కథ మాత్రమే కాదు.. అందులో చాలా విశేషాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో పాటు సాగే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ప్యారలల్ వరల్డ్ కథతో రాకా సినిమా వస్తుంది. రామ్ చరణ్ పెద్దిలో కూడా కమర్షియల్ కంటే ఊరికోసం ఓ కుర్రాడు ఏం చేసాడనేది చెప్తున్నారు బుచ్చిబాబు. ఈ కాన్సెప్ట్ భాషా బేధం లేకుండా అందర్నీ మెప్పిస్తుందంటున్నారు మేకర్స్. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని నమ్మకంగా ఉన్నారు వాళ్లు. పైగా పెద్ది కోసం ఊహించనంతగా మేకోవర్ అయ్యారు చరణ్. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పైకి కమర్షియల్ కథలాగే ఉన్నా.. కాన్సెప్ట్ చాలా పెద్దది. ఇండిపెండెన్స్ నుంచి మొదలుపెట్టి చాలా పెద్ద కథ చెప్తున్నారు నీల్. క్లైమాక్స్‌కు వచ్చేసరికి దేశభక్తితో ఎండ్ అవుతుందన్నారు ఈ దర్శకుడు. ఇక వారణాసిలో ఖండాలు, జన్మలు దాటేసి.. వేల ఏళ్లు ప్రయాణించే కథను చెప్తున్నారు రాజమౌళి. మరి ప్యాన్ ఇండియా మెప్పించాలంటే.. ఈ మాత్రం గట్టి కాన్సెప్టులు ఉండాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

Follow Us