AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Lollipop Recipe: ఎప్పుడూ బోరింగ్ చికెన్ కర్రీనా?.. నోరూరించే ‘చికెన్ లాలిపాప్’ ఇలా చేసేయండి!

చాలా మంది ఇళ్లల్లో చికెన్ తెచ్చుకోవడం, ఎప్పట్లాగే రొటీన్‌గా చికెన్ కర్రీనో లేదా చికెన్ ఫ్రైయో వండేస్తుంటారు. వారం వారం అదే బోరింగ్ కూర తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి చికెన్‌తో ముఖం తిప్పుకోకుండా, సాయంత్రం స్నాక్ టైమ్‌లో హోటల్ స్టైల్‌లో అదిరిపోయే 'చికెన్ లాలిపాప్' ట్రై చేయండి. థియేటర్లలోనో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనో ఎక్కువ రేటు పెట్టి కొనే ఈ క్రంచీ, జ్యుసీ స్టార్టర్‌ను చాలా తక్కువ ఖర్చుతో పక్కా కొలతలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. .

Chicken Lollipop Recipe: ఎప్పుడూ బోరింగ్ చికెన్ కర్రీనా?.. నోరూరించే 'చికెన్ లాలిపాప్' ఇలా చేసేయండి!
Chicken Lollipop Recipe Telugu
Bhavani
|

Updated on: May 28, 2026 | 9:55 PM

Share

ముక్క నోట్లో వేస్తే కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా జ్యుసీగా ఉండే ఈ లాలిపాప్స్ పిల్లలకైతే అమితంగా నచ్చేస్తాయి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ పర్ఫెక్ట్ క్రిస్పీగా మరియు స్పైసీగా రావడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇక్కడ ఉంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ఈవెనింగ్ స్నాక్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం

కావలసిన పదార్థాలు

చికెన్ లాలిపాప్ ముక్కలు (రెక్కల భాగం) – 500 గ్రాములు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 పెద్ద చెంచా

మైదా పిండి – 3 పెద్ద చెంచాలు

కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) – 3 పెద్ద చెంచాలు

కోడిగుడ్డు – 1

కారం పొడి – 1.5 చెంచా

మిరియాల పొడి – 1 చెంచా

సోయా సాస్ – 1 చెంచా

రెడ్ చిల్లీ సాస్ – 1 చెంచా

వెనిగర్ లేదా నిమ్మరసం – 1 చెంచా

ఉప్పు – రుచికి సరిపడా

ఫుడ్ కలర్ (రెడ్) – చిటికెడు (ఆప్షనల్)

నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం

మొదట చికెన్ లాలిపాప్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకుని.. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో మ్యారినేట్ అవ్వనివ్వాలి. దీనివల్ల మసాలాలు ముక్క లోపలి వరకు వెళ్లి జ్యుసీగా మారుతుంది.

30 నిమిషాల తర్వాత ఫ్రిజ్ నుండి చికెన్ తీసి.. అందులోనే మైదా పిండి, కార్న్ ఫ్లోర్ మరియు ఒక కోడిగుడ్డు సొన వేయాలి. (హోటల్ లుక్ కావాలనుకునే వారు ఇక్కడే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు). ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పిండి అంతా చికెన్ ముక్కల చుట్టూ లావుగా, గట్టిగా కోటింగ్ అయ్యేలా బాగా కలపాలి.

స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగాక, స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చాలి. ఇప్పుడు ఒక్కో లాలిపాప్ ముక్కను తీసుకుని, పిండి కోటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకుంటూ జాగ్రత్తగా నూనెలో వేయాలి.

ముక్కలు వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు, ఒక నిమిషం ఆగి అటు ఇటు తిప్పుతూ వేయించాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంటేనే లోపల చికెన్ బాగా ఉడుకుతుంది. ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, పైన లేయర్ కరకరలాడే వరకు (సుమారు 8 నుండి 10 నిమిషాలు) వేయించి ప్లేట్లలోకి తీసుకోవాలి.

అంతే.. ఎంతో రుచికరమైన, వేడివేడి రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ రెడీ! దీనిపై కొద్దిగా నిమ్మరసం చల్లుకుని, టొమాటో కెచప్ లేదా షజ్వాన్ సాస్‌తో తింటే సాయంత్రం వేళ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ