AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్‌కు 3 ఏళ్ల బ్యాన్?.. బాలీవుడ్‌లో సంచలనం

Ranveer Singh: డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్‌కు 3 ఏళ్ల బ్యాన్?.. బాలీవుడ్‌లో సంచలనం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 28, 2026 | 7:46 PM

Share

రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ మూడేళ్ల నిషేధం విధించిందనే వార్త బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ‘డాన్ 3’ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిందని ఫెడరేషన్ పేర్కొంది. అయితే వరుసగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరోపై ఇంత కఠిన నిర్ణయం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల నిషేధం వెనుక అసలు కారణమేంటి..? ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బాలీవుడ్ మేకర్స్ ఏమంటున్నారు..? రణ్‌వీర్‌తో సినిమాలు చేసే నిర్మాతల పరిస్థితేంటి..? డాన్ 3 నుంచి తప్పుకోవడం ఎలాంటి మలుపులు తిరుగుతుంది.. దీనిపై ఆయన లీగల్ టీమ్ ఏమంటున్నారు..? దురంధర్ ఫ్రాంచైజీతో 4 నెలల గ్యాప్‌లోనే 3000 కోట్లు వసూలు చేసి.. రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు రణ్వీర్ సింగ్. ఇదేమంత చిన్న రికార్డ్ కాదు.. ఇలాంటి సమయంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ హీరోపై మూడేళ్ల నిషేధం విధించడం సంచలనంగా మారింది. ఈ నిబంధనల ప్రకారం ఏ దర్శక నిర్మాత రణ్‌వీర్‌తో పని చేయడానికి వీల్లేదు. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3 నుంచి రణ్‌వీర్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. దీని వల్ల నిర్మాణ సంస్థకు 45 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఫెడరేషన్ తెలిపింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, టెక్నికల్ టీం అడ్వాన్స్, యాక్టర్స్ రెమ్యునరేషన్స్‌ల కోసం పెట్టిన ఖర్చు అంతా వృధా కావడంతోనే రణ్‌వీర్ సింగ్‌పై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో హేరా పెరీ 3 టైమ్‌లో పరేష్ రావల్ ఇలాగే సినిమా మధ్యలోంచి తప్పుకుంటే నష్టపరిహారం కింద డబ్బులిచ్చి మ్యాటర్ సెటిల్ చేసారు. మరి రణ్వీర్‌ను ఎందుకు బ్యాన్ చేసారనేది ఫ్యాన్స్ ప్రశ్న. ప్రస్తుతానికి మౌనంగా ఉన్న రణ్‌వీర్ సింగ్.. తన లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నారు. మూడేళ్ళ నిషేధం అంటే చాలా పెద్దది.. మరి దీనిపై ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

Published on: May 28, 2026 04:27 PM
Follow Us