కామారెడ్డి పట్టణంలోని 35వ వార్డు, శివాలయం వీధిలో ఓ వింత చోరీ జరిగింది. దుండగులు విలాసవంతమైన కారులో వచ్చి ఇంటి గేటు దూకి విలువైన వస్తువులను అపహరించారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.