దేశంలోనే నంబర్ 1.. 26 కి.మీ మైలేజీతో రూ.8.80 లకలకే CNG కారు

May 23, 2026

Subhash

భారతీయ మధ్యతరగతి కుటుంబాల మోస్ట్ ఫేవరెట్ 7-సీటర్ కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga CNG) దూసుకుపోతోంది.

CNG కారు

ఆర్థిక సంవత్సరం FY2026 లో ఏకంగా 1.45 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన CNG కారుగా నిలిచింది.

రికార్డ్ స్థాయి అమ్మకాలు

మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డిజైర్, వ్యాగన్ఆర్, బ్రెజ్జా, నెక్సాన్ వంటి పాపులర్ CNG కార్లను సైతం వెనక్కి నెట్టి ఎర్టిగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

దిగ్గజ కార్లను వెనక్కి నెట్టి

ఈ కారు కేబిన్‌లో అందించిన ఉడెన్ (చెక్క) లాంటి ఫినిషింగ్, కారుకు మరింత లగ్జరీ, ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. కారును చూస్తేనే అదిరిపోయేలా ఉంటుంది.

కారు లోపల ప్రీమియం ఫీల్

ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

అదిరిపోయే స్మార్ట్ ఫీచర్స్

ఎర్టిగా CNG లో 1.5-లీటర్ K-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇది 88bhp పవర్‌ను మరియు 121.5Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

దమ్మున్న ఇంజిన్ పర్ఫార్మెన్స్

కంపెనీ ప్రకారం ఇది కేజీ CNG కి 26.11 కిమీ మైలేజ్ ఇస్తుంది. సాధారణంగా రోడ్లపై వాడినప్పుడు కూడా 22 నుండి 24 కిమీ వరకు మైలేజ్ పొందవచ్చు.

మైలేజ్ ఎంతంటే?

అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ సూపర్ హిట్ 7-సీటర్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.80 లక్షలుగా ఉంది.

బడ్జెట్ ధర.. బెస్ట్ సేఫ్టీ