హైదరాబాద్ కొంపల్లిలోని జయబేరి కాలనీలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు దొంగను చుట్టుముట్టి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.