AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ కాదు.. ఇప్పుడు యాక్షన్‌నే టార్గెట్ చేస్తున్న హీరోయిన్లు

గ్లామర్ కాదు.. ఇప్పుడు యాక్షన్‌నే టార్గెట్ చేస్తున్న హీరోయిన్లు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 28, 2026 | 4:00 PM

Share

గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు హీరోయిన్లు యాక్షన్ ఇమేజ్ కోసం దూసుకెళ్తున్నారు. సమంత, రష్మిక, నయనతార, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ బ్యూటీలు స్టంట్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కథలపై పెరుగుతున్న ఆసక్తితో ఇండియన్ సినీ పరిశ్రమలో హీరోయిన్లకు కొత్త మాస్ ఇమేజ్ ఏర్పడుతోంది.

హీరోయిన్లు అంటే కేవలం పాటలకే పరిమితం.. గ్లామర్ షోకే అంకింతం అనే రోజులు పోయాయి. నాణేనికి ఒకవైపే కాదు రెండు వైపులా పదునే అంటున్నారు మన బ్యూటీస్. ఓవైపు అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ రప్ఫాడిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకేం తీసిపోవట్లేదు ముద్దుగుమ్మలు. మరి వాళ్లెవరో ఓసారి చూద్దామా..? హీరోయిన్లు అంటే వాళ్లలోని గ్లామర్ యాంగిల్ వాడుకోడానికే చూస్తుంటారు మేకర్స్. కానీ తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు హీరోయిన్లు. హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే వింతేం ఉంది.. కానీ హీరోయిన్లకు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చినపుడే విశేషం. సుకుమారి సుందరీమణులంతా ఇదే చేస్తున్నారిప్పుడు. సింపుల్‌గా మాస్ బొమ్మ చూపించేస్తున్నారు. రష్మిక మందన్న అంటే గ్లామర్ విత్ పర్ఫార్మెన్స్ అనే గుర్తుకొస్తారు.. కానీ ఈ మధ్య స్టైల్ మార్చేసారు మిసెస్ దేవరకొండ. పెళ్ళి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసారు. ఆ మధ్య గర్ల్ ఫ్రెండ్‌లో అదిరిపోయే రోల్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మైసా కోసం యాక్షన్ డోస్ పెంచేసారు. అలాగే రుక్మిణి వసంత్ సైతం కాంతారలో కత్తి యుద్ధాలు చేసారు.. టాక్సిక్‌లో స్టైలిష్ స్టంట్స్ చేస్తున్నారు. సమంత అయితే పూర్తిగా మాస్ హీరోయిన్ అయిపోయారు.. యశోద సినిమాలో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఈ బ్యూటీ.. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్‌లలో దీన్నే కంటిన్యూ చేశారు. తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో చీరకట్టులోనే యాక్షన్ సీన్స్ చేస్తూ రప్ఫాడించారు. గన్స్ పట్టుకుని మోత మోగించేస్తున్నారు. నయనతార ఎప్పట్నుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య జవాన్‌లో అదిరిపోయే యాక్షన్ చేసిన నయన్.. రెక్కయ్ కోసం బాకు పట్టుకుని పెద్ద యుద్ధమే చేస్తున్నారు. వారణాసిలో ప్రియాంక చోప్రా సైతం అదిరిపోయే స్టంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపు వెళ్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

Follow Us