AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్‌లక్కోడంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. సూర్య, గంభీర్‌లకు లైవ్‌లో ఇచ్చిపడేశాడుగా..

Suryakumar Post Match Interview: బ్యాడ్ లక్కోడంటూ ముద్రవేసి జట్టు నుంచి తప్పించారు. రాకరాక ఛాన్స్ వస్తే విఫలమవుతుంటాడంటూ నెటిజన్లు కూడా తిట్టిపోస్తుంటారు. కానీ, తనదైన రోజు శాంసన్ తనపై విమర్శలు గుప్పించిన వారికి తన బ్యాట్‌తోనే నోళ్లు మూయించేందుకు సిద్ధమయ్యాడు. ఆరోజు రానే వచ్చింది.

బ్యాడ్‌లక్కోడంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. సూర్య, గంభీర్‌లకు లైవ్‌లో ఇచ్చిపడేశాడుగా..
Team India
Venkata Chari
|

Updated on: Mar 02, 2026 | 1:52 PM

Share

Suryakumar Yadav on Sanju Samson: భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడు సంజూ శాంసన్. ఫామ్ సమస్యల కారణంగా ప్లేయింగ్ XI నుంచి తప్పించబడే పరిస్థితి వచ్చినా, అవకాశాన్ని అందిపుచ్చుకుని మ్యాచ్ విన్నింగ్ 97 పరుగులతో జట్టును గెలిపించాడు.

ఒకవైపు వికెట్లు పడుతుండగా, మరోవైపు సంజూ నిలకడగా ఆడుతూ జట్టును లక్ష్యానికి చేర్చాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

“సంజూ కష్టానికి ఫలితం”: సూర్యకుమార్..

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, “ఇది చాలా మంచి ఫీలింగ్. మేం ఎలా ఆడామో చూసుకుంటే గర్వంగా ఉంది. ఇది క్వార్టర్ ఫైనల్ లాంటి ‘డూ ఆర్ డై’ మ్యాచ్. అబ్బాయిలు చూపిన కేరెక్టర్ అద్భుతం. నేను ఎప్పుడూ చెబుతాను, మంచి మనుషులకు మంచి జరుగుతుంది. సంజూ చాలా సహనంతో ఎదురుచూశాడు. జట్టులో లేకపోయినా, వెనుకపడ్డ సమయంలో ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టానికి ఇప్పుడు సరైన సమయంలో ఫలితం దొరికింది. అతను ఆడిన తీరు జట్టును పూర్తిగా గెలిపించింది” అని అన్నాడు.

ఇది కూడా చదవండి: IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?

బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు..

అలాగే, సూర్యకుమార్ బౌలర్లను కూడా అభినందించాడు. “అందరూ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఈడెన్ గార్డెన్స్‌లో మంచు (dew) కారణంగా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించడం సాధ్యమేనని మాకు తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి బాగా బ్యాట్‌కు వస్తుంది. చిన్న చిన్న భాగస్వామ్యాలు మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాయి” అని తెలిపాడు.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

సెమీఫైనల్‌పై స్పందన..

సెమీఫైనల్ గురించి మాట్లాడుతూ, “సెమీఫైనల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచే మేం ఇక్కడికి రావడానికి అర్హులమేనని అనిపించింది. ఇప్పుడు ముంబైలో మ్యాచ్ ఉండటం ప్రత్యేకం. కానీ ఇప్పుడే ఆలోచించం. విశ్రాంతి తీసుకుని ముంబై చేరిన తర్వాత వ్యూహాలపై దృష్టి పెడతాం. అంచనాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ మైదానంలో జట్టుగా ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం” అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

సంజూ శాంసన్‌పై వచ్చిన సందేహాలకు ఈ ఇన్నింగ్స్ సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు సెమీఫైనల్‌లో టీమిండియా అదే జోష్ కొనసాగించగలదా అన్నదే ఆసక్తికరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us