- Telugu News Photo Gallery Cinema photos Ravi Teja gets a blockbuster hit with a movie rejected by two Pan India heroes!
ఇద్దరు పాన్ ఇండియా హీరోలు రిజక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ!
చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజక్ట్ చేసిన మూవీతో మరో హీరో హిట్ కొట్టడం అనేది కామన్. అయితే ఒక హీరో కాదండోయ్, ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు రిజక్ట్ చేసిన కథతో మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏది అని ఆలోచిస్తున్నారా? తెలుసుకోండి మరి!
Updated on: Apr 18, 2025 | 5:52 PM

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వద్దకు ఎన్నో కథలు వెళ్తాయి. అందులో తమకు నచ్చినవి తీసుకొని, నచ్చని సినిమాలను రిజక్ట్ చేస్తారు హీరోలు. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఓ మూవీ కథను రిజక్ట్ చేశారు.

కానీ ఆ కథకు ఒకే చెప్పి హీరో రవితేజ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్స్ లో భద్ర కూడా ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా భద్ర సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఈ సినిమాను మొదట డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలని, అతని కోసమే కథను రాసుకున్నాడంట. దీంతో ఒక రోజు హీరోకు కథను కూడా వినిపించాడంట. కానీ తారక్ కు కథ నచ్చకపోవడంతో మూవీని రిజక్ట్ చేశారు.

తర్వాత దర్శకుడు అల్లు అర్జున్ వద్దకు వెళ్లి మూవీ కథను వివరించాడంట. అల్లు అర్జున్ కు కథ బాగా నచ్చిందంట. కానీ ఈ హీరో అప్పటికే ఆర్య సినిమా కమిట్ అవ్వడంతో మూవీని రిజక్ట్ చేశాడంట. అలా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేసుకున్న ఈ కథను డైరెక్టర్ రవితేజకు వినిపించాడంట.

ఈ హీరోకు కథ బాగా నచ్చడంతో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా బోయపాటి, రవితేజ కాంబోలో భద్ర మూవీ తెరకెక్కి కలెక్షన్ల వర్షం కురిపించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్ఉతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



