సీరియల్లో విలన్.. అందంలో అప్సరస.. నెట్టింట గ్లామర్ సెన్సేషన్..

Rajitha Chanti

Pic credit - Instagram

04 March 2026

తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని సీరియల్ బ్యూటీ శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

ఈ సీరియల్లో విలన్ మోనితా పాత్రలో నటనతోపాటు అందంతోనూ మెస్మరైజ్ చేసింది. ఈ సీరియల్ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం సీరియల్స్ చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఈ భామ. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. మరోవైపు సొంతం య్యూట్యూబ్ ఛానల్ ఉంది.

కాలేజీ రోజుల్లో ఈ ఈవెంట్ జరిగినా చురగ్గా పాల్గొనేదట. అదే సమయంలో ఒక దర్శకుడు తనను సీరియల్స్ ట్రై చేయాలని చెప్పడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ.

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని మొదటిసారి అడిషన్ కు వెళ్లానని.. దీంతో వాటిని చూసి అక్కడున్నవారంతా నవ్వుకున్నారని.. తెలియక అలా చేశానని తెలిపింది.

 కన్నడ సీరియల్స్ లో చేసింది. తన మొదటి సీరియల్ కు రోజుకు రూ.750 మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు తెలిపింది. కన్నడతోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో విలన్ పాత్రలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ముద్దుగుమ్మకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చినట్లు తెలిపింది.

జీవితంలో ఎన్నో సమస్యలు ఫేస్ చేశానని.. అన్నీ సమస్యలు తీరిపోయినట్లు తెలిపింది. టీవీ నటుడు యశ్వంత్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది శోభా శెట్టి.