Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..
చిన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో తమ కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదని.. దీంతో నీళ్లు తాగి బతికానని.. రోజుకు కేవలం 8 రూపాయాలు మాత్రమే ఉండేవని తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలోనే సంచలనం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సెన్సెషన్. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు వెండితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2002లో కిట్టీ పార్టీ అనే టెలివిజన్ ధారావాహికలో ఒక చిన్న పాత్రతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సహాయక పాత్రలలో కనిపించింది. చివరకు నిర్మాత ఏక్తా కపూర్ తెరకెక్కించిన ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తక్కువ సమయంలోనే హిందీలో పలు స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన ‘ప్యార్ కా పంచనామా’ చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ మూవీ రూ.200 కోట్లు వసూలు చేసి 2019 లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ నుష్రత్ భరుచా.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబంలో తానే ఏకైక సంపాదకురాలిని అని, తన కళాశాల రోజుల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. రోజుకు కేవలం 8 రూపాయలు ఖర్చు చేసి, నీళ్లు తాగుతూ బతికానని చెప్పుకొచ్చింది. “కెరీర్ తొలినాళ్లల్లో ఒక నెలలో ఎంత ఖర్చూ చేయాలో అని ముందే నిర్ణయించుకున్నాను. నా ముఖ్యమైన అవసరాల తర్వాత మరోసారి కొనుగోలు చేయడం లేదా పొదుపు చేయడం చేశాను. ఆ డబ్బు నా బ్యాంకు ఖాతాలోకి ఎప్పటికీ రాదు. మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తాను. నా తండ్రి వ్యాపారంలో మోసపోయిన తర్వాత నా ప్రపంచాన్ని మార్చుకున్నాను. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చూశాము. డబ్బు ఖర్చు చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. కాలేజీ రోజుల్లో 5 సంవత్సరాలలో కేవలం 100 మాత్రమే ఖర్చు చేశాను. రోజుకు రూ.8 ప్రయాణం కోసమే ఖర్చు చేశాను. కాలేజీలో ఉచిత నీళ్లు.. నాకు ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లే తాగేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది నుష్రత్ భరుచా. సహజ నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన మరిన్ని సినిమాలు అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..