AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్.. గట్టిగానే ఇచ్చేపడేసిందిగా..

ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిందీ టాలీవుడ్ ఫేమస్ నటి. అయితే తాజాగా ఆమె బాలీ వెకేషన్ కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ టాలీవుడ్ నటిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Tollywood: దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్.. గట్టిగానే ఇచ్చేపడేసిందిగా..
Tollywood Anchor
Basha Shek
|

Updated on: May 05, 2025 | 5:32 PM

Share

ఈ టాలీవుడ్ నటి కమ్ స్టార్ యాంకర్ ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైంది ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కూడా జరిగింది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యల కారణంగా సర్జరీ జరిగిందని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. అలాగే డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు అందులో తెలిపింది. అయితే ఉన్నట్లుండి బాలిలో ప్రత్యక్షమైందీ అందాల తార. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అంతే కొందరు నెటిజన్లు ఈ టాలీవుడ్ యాంకరమ్మను ట్రోల్ చేశారు. పహల్గామ్ దాడి ఘటనతో దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్ కు వెళతావా? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయితే తానెందుకు ఇక్కడికి వచ్చానో చెబుతూ తనను ట్రోల్ చేసిన వారికి గట్టిగానే ఇచ్చి పడేసిందీ టాలీవుడ్ నటి. ఇలా వెకేషన్ తో వార్తల్లో నిలిచిన ఆ బ్యూటీ మరెవరో కాదు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్. తన పుట్టిన రోజు (ఏప్రిల్ 27) వేడుకల సందర్భంగా ఆమె బాలీ వెకేషన్ కు వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

‘ఎన్నో సాహసాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఈ వెకేషన్ ను ప్లాన్‌ చేశా. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. నిద్రపోవడం, నచ్చిన ఫుడ్‌ తినడంతోనే ఈ టూర్‌ గడుస్తోంది. జీవితంలో కొత్త విషయాలను నేర్పించడానికి దేవుడు ఇలా వింతైన మార్గాలు ఎంచుకుంటాడని అనిపిస్తోంది’ అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది రష్మి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. దీనిపై స్పందించిన రష్మీ ఇలా కౌంటర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

బాలి వెకేషన్ లో యాంకర్ రష్మీ..

‘ ప్రస్తుతం నేను బాలిలో ఉన్నా. నా సంస్కృతి, సంప్రదాయాలకు ఈ దేశం ఎంతో దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది రెండు నెలల క్రితమే ప్లాన్‌ చేసిన వెకేషన్. పుట్టినరోజుకు ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతానికి టూర్‌కు వెళ్లడం నాకు ఇష్టం. అందుకే ఇక్కడకు వచ్చాను. శస్త్రచికిత్స నుంచి నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా’’ అని రిప్లై ఇచ్చింది రష్మీ.

కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ