Sekhar Master: అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్.. అసలు ఏం జరిగిందంటే?
ప్రస్తుతం టాలీవుడ్ లో ది టాప్ మోస్ట్ కొరియో గ్రాఫర్ ఎవరంటే శేఖర్ మాస్టర్ పేరే వినిపిస్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకూ ఈ డ్యాన్స్ మాస్టరే కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మధ్యన వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు శేఖర్ మాస్టర్.

ఈ మధ్యన తన డ్యాన్స్ స్టెప్పుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు శేఖర్ మాస్టర్. డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లో అతను కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. వీటి సంగతి పక్కన పెడితే ఇటీవల ఓ మహిళ డ్యాన్సర్ విషయంలో శేఖర్ మాస్టర్ ప్రవర్తించిన తీరును కొందరు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించాడు శేఖర్ మాస్టర్. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సాంగ్స్ కాంట్రవర్సీ, హుక్ స్టెప్పుల మీద ట్రోలింగ్, మహిళా డ్యాన్సర్ ఉన్న ఇష్యూస్ గురించి స్పందించాడు. ‘ ఓ కొరియోగ్రాఫర్‌గా వర్క్ విషయంలో కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ టీవీ కార్యక్రమాలకు వచ్చేసరికి అలాంటిదేమీ ఉండదు. టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరించడం కాస్త రిలాక్స్‌డ్ గా అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్ విషయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే, ఆ సీజన్‌లో పాల్గొన్న మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆమె చాలా బాగా డ్యాన్స్ చేసిందని పించింది. అందుకే ఆమెను మెచ్చుకున్నా. కానీ దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు’
‘ ట్యాలెంట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేయకూడదా? చివరకు నా వల్లే ఆమె విజేత అయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మా గురించి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. చివరకు నా సోషల్‌మీడియా నా పోస్టులకు కూడా ఆమె గురించి కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం నేను ఎంతో బాధపడ్డాను. నిజం చెప్పాలంటే.. ఆ షో తర్వాత ఆమె ఎవరో కూడా నాకు తెలియదు’ అని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
శేఖర్ మాస్టర్ కామెంట్స్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
అల్లు అర్జున్ తో శేఖర్ మాస్టర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








