AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: హత్య చేసి నోట్లో పెన్‌ డ్రైవ్‌ వదిలి వెళ్లే సైకో.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, పోలీస్ ఇన్వెస్టి గేషన్ సినిమాలంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది . అందులోనూ ఓటీటీ ఆడియెన్స్ లో చాలా మంది ఈ రకమైన జానర్ సినిమాలకే ఎక్కువ ఓటు వేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ లో కూడా ఒక సైకో కిల్లర్ చుట్టూనే తిరుగుతుంది.

OTT Movie: హత్య చేసి నోట్లో పెన్‌ డ్రైవ్‌ వదిలి వెళ్లే సైకో.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 25, 2025 | 5:13 PM

Share

ఈ మధ్యన ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు గానే ఈ జానర్లలోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. ఇక ఓటీటీలు అయితే వివిధ భాషల్లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను అనువారం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ కమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కు చెందినదే. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సైకో కిల్లర్ హత్య చేసిన ప్రతిసారీ ఒక క్లూ వదిలి పెడుతుంటాడు. ఇందు కోసం చనిపోయిన మృతుడి నోటిలో ఒక పెన్‌డ్రైవ్ వదిలి పెడుతుంటాడు దీంతో పోలీసులు ఈ హత్యలను ‘పెన్‌డ్రైవ్ కిల్లింగ్స్’ అని పిలుస్తారు. ఎప్పటిలాగే వీటిని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ, హంతకుడు పోలీసులను ఎగతాళి చేస్తుంటారు. మరీ క్రూరంగా హత్యలు చేయడం ప్రారంభిస్తాడు. ఎంతలా అంటే.. సైకో కిల్లర్ చివరకు బాధితులను సజీవంగా శవపరీక్ష చేస్తూ హత్యలు చేస్తాడు. మరి ఈ హత్యల వెనుక ఉన్నమిస్టరీ ఏంటీ? పోలీసులు ఈ కేసును ఛేదించారా? సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నారు? చంపేటప్పుడు పెన్ డ్రైవ్ లను నోట్లో ఎందుకు పెడుతున్నాడు ? ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇంత వరకు మనం మాట్లాడుకున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు డీఎన్ ఏ. ఇది ఒక మలయాళ సినిమా. 2024లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. టి.ఎస్. సురేష్ బాబు తెరకెక్కించిన ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలో అష్కర్ సౌదాన్, రాయ్ లక్ష్మి, బాబు ఆంటోనీ, అజు వర్గీస్, రెంజీ పనిక్కర్, హన్నా రెజీ కోషి ప్రధాన పాత్రల్లో నటించారు. బెంజీ ప్రొడక్షన్ బ్యానర్ పై KV. అబ్దుల్ నాజర్ ఈ సినిమాను నిర్మించారు. శరత్ సంగీతం అందించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసిన డీఎన్ ఏ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది వీకెండ్ లో మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

డీఎన్ ఏ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.