Mad Square OTT: ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్ స్క్వేర్.. 74 కోట్ల సూపర్ హిట్ కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 25) కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అలా కొన్ని రోజుల క్రితం థియేటర్లలో రిలీజై ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం మ్యాడ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ముగ్గురు హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే మ్యాడ్ స్క్వేర్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన కళ్యాణ్ శంకరే సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించాడు. ఈసారి రెబా మోనికా జాన్, ప్రియాంక జువాల్కర్ లాంటి అందాల తారలకు కూడా సినిమాలో భాగం కల్పించారు. అలాగే భీమ్స్ కు తోడు తమన్ కూడా బీజీఎమ్ సమకూర్చారు. ఇలా మొదటి భాగానికి మించి ఎన్నో హంగులతో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఉగాది పండగ కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం మ్యాడ్ స్క్వేర్ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన మ్యాడ్ స్క్వేర్ సినిమాను ఓటీటీలో చూద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిరీక్షణకు తెరపడనుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. . ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే మ్యాడ్ సీక్వెల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది . తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Laddu ki pelli ante dhoom dham cheyyale 😍🥳 Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/tnJ55on8g1
— Netflix India South (@Netflix_INSouth) April 23, 2025
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా మ్యాడ్ స్క్వేర్ సినిమాను నిర్మించారు. సునీల్, విష్ణు, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. మరి థియేటర్లలో ఈమ్యాడ్ స్క్వేర్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు నెట్ ఫ్లిక్స్ లో ఉంది.. ఎంచెక్కా ఇంటిల్లి పాది చూసి కడుపుబ్బా నవ్వుకోండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








