AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమా సూపర్ హిట్.. వరుసగా 10 రోజులూ డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. చివరకు..

సాధారణంగా సినిమా హిట్ అయితే గ్రాండ్ గా పార్టీలు చేసుకుంటారు పార్టీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అంతో ఇంతో ఆల్కహాల్ కూడా పుచ్చుకుంటారు. కానీ ఈ టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం తన సినిమా హిట్ అయ్యిందని ఏకంగా పది రోజులు తాగాడట.

Tollywood: సినిమా సూపర్ హిట్.. వరుసగా 10 రోజులూ డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. చివరకు..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 24, 2025 | 2:12 PM

Share

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయినా సరే తాగుతుంటారు. సామాన్యుల సంగతి పక్కనబెడితే సినిమా సెలబ్రిటీలు కూడా మద్యం తాగుతుంటారు. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లలో వైన్ తీసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.. కానీ ఈ టాలీవుడ్ క్రేజీ హీరో మాత్రం తన డ్రింకింగ్ హ్యాబిట్ గురించి ఓపెన్ గా చెప్పేశాడు.వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మ్యాడ్. 2023లో ఏ మాత్రం అంచనాలు లేకుడా చిన్న సినిమాగా రిలీజైన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను మ్యాడ్ మూవీ బాగా నచ్చేసింది. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ అంటూ సీక్వెల్ కూడా వచ్చి హిట్ అయింది. ‘మ్యాడ్’ ఫ్రాంచైజీలో మనోజ్ పాత్రలో అందిరినీ ఆకట్టుకున్నాడు రామ్ నితిన్.లవర్ బాయ్ పాత్రలో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రామ్ నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు.

‘మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత ఒక పది రోజులు డైలీ మందు తాగాం. అప్పుడు మందు ఇంత బాగుంటదా అనిపించింది. ఒక రోజు సంగీత్, నేను ఫుల్ బాటిల్ తాగాం. అయిపోయిందా, ఎక్కిందా అని అడిగితే సంగీత్ సరిపోలేదు అన్నాడు. ఇంకేం కావాలి అనుకున్నా. సంగీత్ ఒక వోడ్కా బాటిల్ తీసుకొచ్చాడు. సగం తాగి బాత్రూమ్ లో వాంతి చేసుకున్నాం. అప్పుడే మేం డిసైడ్ అయ్యాం కేవలం సినిమా హిట్ అయినప్పుడే మందు తాగాలి అని. మళ్లీ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిన తర్వాతే పార్టీ చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చాడీ యంగ్ హీరో. ప్రస్తుతం రామ్ నితిన్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రామ్ నితిన్ కామెంట్స్.. వీడియో..

మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్లలో రామ్ నితిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..