AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 500 కోట్ల డైమండ్‌ రాబరీ.. ఓటీటీలో ధూమ్ 2 తరహా హెయిస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 25) ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. అందులో ఈ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కాస్త స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

OTT Movie: 500 కోట్ల డైమండ్‌ రాబరీ.. ఓటీటీలో ధూమ్ 2 తరహా హెయిస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 26, 2025 | 2:14 PM

Share

మనీ హెయిస్ట్ సిరీస్ లు, సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులోనూ ఈ తరహా సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సరిగ్గా ఇదే కాన్సెప్టుతో వచ్చిన ధూమ్ 2, ధూమ్ 3 సినిమాలు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. ముఖ్యంగా ధూమ్ 2 సినిమాలోని డైమండ్ రాబరీ కాన్సెప్ట్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. ఇప్పుడిదే కాన్సెప్టుతో మరో సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథంతా రూ. 500 కోట్ల విలువైన  డైమండ్ రాబరీ చుట్టూ తిరుగుతుంది. ముంబయిలోని ఓ మ్యూజియంలో వేలాది మందిసెక్యూరిటీ గార్డ్స్‌.. లోపల అధునాతన సాంకేతికతో కూడిన భద్రత నడుమ ఈ వజ్రాన్ని ఉంచుతారు. మరి అలాంటి చోట ఉన్న వజ్రాన్ని చోరీ చేసేందుకు హీరో ఎలాంటి ప్రణాళికలు రచిస్తాడు. మ్యూజియం లోపలికి వెళ్లాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అదే సమయంలో హీరో ప్లాన్స్ ను పసిగట్టిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు ఏం చేశారు? మరి చివరకు హీరో పోలీసుల కళ్లు గప్పి ఆ 500 కోట్ల విలువైన డైమండ్ ను దొంగిలించాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ డైమండ్ రాబరీ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చూడాల్సిందే.

ఇంతకీ మనం మాట్లాడుకుంటోన్న సినిమా ఏదో తెలుసా? జ్యూవెల్ థీప్‌. ఇది బాలీవుడ్ సినిమా. దేవర విలన్ సైఫ్ అలీఖాన్ ఇందులో స్టైలిష్ హీరోగా నటించడం విశేషం. అలాగే జైదీప్‌ అహ్లావత్‌, నికితా దత్తా , కునాల్‌ కపూర్‌ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. కూకీ గులాటి, రాబీ గ్రేవాల్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శుక్రవారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జ్యూవెల్ థీఫ్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. సినిమా చూసిన వారందరూ తమ అభిప్రాయాన్ని నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. సినిమా విజువల్ గ్రాండ్ గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్‌లు, ముఖ్యంగా చేజ్ సీన్స్, హీస్ట్ సన్నివేశాలు అద్దిరిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ లో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే సైఫ్ నటించి ఈ జ్యూవెల్ థీఫ్ మీకు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.