AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ బిగ్ స్కెచ్.. కేజీఎఫ్2, సలార్‌లను మించేలా..

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే హిందీ చిత్రం 'వార్ 2' లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఈ ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కుముటా దగ్గర జరుగుతోంది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ బిగ్ స్కెచ్.. కేజీఎఫ్2, సలార్‌లను మించేలా..
Prashanth Neel, Jr Ntr
Basha Shek
|

Updated on: Apr 26, 2025 | 4:45 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ చిత్రం ‘ వార్ 2 ‘ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు . ప్రస్తుతం అతను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి ముందుగా ‘డ్రాగన్’ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుఉ ఆ సినిమా పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో ఓ భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్కడే ఉండి షూటింగ్ కు హాజరుకానున్నాడు. ఒక పెద్ద హెలికాప్టర్, ఇళ్ళు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే లోకోమోటివ్‌లు, భారీ తుపాకులు, ట్యాంకర్లను తీసుకువచ్చి సినిమా సెట్‌పై పార్క్ చేశారు. ధరేశ్వర్ సెట్ చూస్తుంటే సినిమా గ్రాండియర్ గా తెరకెక్కుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఈ భారీ సెట్‌ను రామనగింది బీచ్‌లో నిర్మించారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ ‘కేజీఎఫ్’ చిత్రాలకు సెట్లు నిర్మించిన బృందమే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి కూడా సెట్లు నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరాటంకంగా జరుగుతోంది. అలాగే సినిమా సెట్‌లోకి ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రుర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు. భువన్ గౌడ కెమెరా వర్క్‌ను నిర్వహించనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం దాదాపు తన పాత టీమ్ నే వాడుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు నెలల క్రితం ప్రారంభమైంది, జూనియర్ ఎన్టీఆర్ వారం క్రితమే ఈ తారాగణంలో చేరారు. ఇది ఒక గొప్ప యాక్షన్ సినిమా. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ నీల్-జీ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విడుదల చేస్తారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర 2’ షూటింగ్ ప్రారంభిస్తాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్ 2’ సినిమా ప్రారంభిస్తాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..