- Telugu News Photo Gallery Cinema photos Actress Meenakshi Chaudhary Intresting Comments On Doing Movies With Senior Heros
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ విజయాలు.. అలాగే వరుస ఆఫర్లతో ఇప్పుడు ఇండస్ట్రీలోనే బిజీగా మారింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Apr 27, 2025 | 1:58 PM

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మీనాక్షి చౌదరి.

ఇటీవలే లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అలరించింది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ప్లాప్స్ అయితే తనను బాధ్యురాలిని చేశారని తెలిపింది.

లక్కీ భాస్కర్ సినిమాతో తన లక్ మారిందని చాలా మంది అంటున్నారని... ఆ సినిమా నచ్చిందని.. కానీ ఇకపై పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తానని తెలిపింది. తన హైట్ 6.2 అని.. దీంతో తనతో కలిసి మాట్లేందుకు అమ్మాయిలు కూడా ఇష్టపడేవాళ్లు కాదని తెలిపింది.

సీనియర్ హీరోలతో నటించేందుకు తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని.. అదో జోనర్ గా భావిస్తానని తెలిపింది. వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం చాలా ఎంజాయ్ చేశానని.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది.

తన మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుందని.. సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటానని.. ఏదైన ఉంటే తానే అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియన్ కల్చర్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.



















