- Telugu News Photo Gallery Cinema photos Fans are getting serious on Kollywood heroes, saying it would be good if they competed in providing quality content.
Kollywood Heroes: ఎవరు ముందు చేస్తే ఏంటి? కోలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్ ఫైర్..
కాదేది రచ్చకి అనర్హం అన్నట్టుగా ఉంది కోలీవుడ్ పరిస్థితి. తమిళనాట ఫ్యాన్స్ వార్ చాలా కామన్, కానీ ఇప్పుడు ఏకంగా స్టార్స్ మధ్య వార్‌లా మారింది సిక్స్ ప్యాక్ వ్యవహారం. మేమంటే మేం ముందంటూ పోటీ పడుతున్నారు టాప్ స్టార్స్. అసలు ఈ గొడవంతా ఎందుకు మొదలైంది అనుకుంటున్నారా..? అయితే స్టోరీ మీద ఓ లుక్కేసేయండి.
Updated on: Apr 27, 2025 | 11:40 AM

ఈ వివాదానికి బీజం సూర్య హీరోగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్‌లో పడింది. ఈ వేడుకకు వచ్చిన సూర్య తండ్రి శివ కుమార్ స్టేజ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇంత రచ్చకు కారణం.

సూర్య డెడికేషన్ గురించి మాట్లాడిన శివకుమార్ 'మా అబ్బాయి కంటే ముందు కోలీవుడ్‌లో ఎవరూ సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. సినిమా కోసం అంత కష్టపడ్డ మొదటి హీరో మావాడే' అన్నారు శివ కుమార్.

ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండగానే ఇప్పుడే మరో హీరో విశాల్ స్పందించారు. తమిళనాట తొలి సిక్స్ ప్యాక్ హీరో సూర్య కాదు ధనుష్ అని క్లారిటీ ఇచ్చారు.

2007లో రిలీజ్ అయిన పొల్లాధవన్ సినిమా కోసం ధనుష్ సిక్స్ ప్యాక్ చేశారని గుర్తు చేశారు. 2008లో వచ్చిన సెల్యూట్ సినిమా కోసం తాను కూడా సిక్స్‌లో కనిపించా అన్నారు కోలీవుడ్ హీరో విశాల్.

అనవసరమైన రాద్ధాతం చేస్తున్న హీరోల మీద ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్వాలిటీ కంటెంట్ ఇవ్వటంలో ఇలా పోటి పడితే మంచి సినిమాలు వస్తాయి. అంతేగానీ సిక్స్ ప్యాక్ ఎవరు ముందు చేస్తే ఏంటి? అంటూ సెటైర్స్ వేస్తున్నారు.




