- Telugu News Photo Gallery Cinema photos Who will win between Junior NTR and Chiranjeevi, who is entering the fray once again after 24 years?
Jr.NTR V/s Chiru: తారక్, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
సినీరంగానికి సంక్రాంతి సీజన్ చాలా ఇంపార్టెంట్ అందుకే మధ్యలో ఎన్ని రిలీజ్‌లు ఉన్నా... 2026 సంక్రాంతి గురించి ఆల్రెడీ డిస్కషన్ మొదలైంది. ఈ సారి పొంగల్ బరిలో ఓ ఇంట్రస్టింగ్ క్లాష్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఓ సీనియర్ హీరోతో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు మరో టాప్ హీరో..? ఇద్దరు బడా హీరోలు బరిలో దిగుతారన్న అంచనాలు ఉండటంతో ఇప్పటికే నుంచే హీట్ కనిపిస్తోంది.
Updated on: Apr 27, 2025 | 11:06 AM

సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేస్తామని ప్రామిస్ చేసిన అనిల్, పక్కా ప్లానింగ్‌తో సినిమాను సిద్ధం చేస్తున్నారు.

చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామని డిక్లేర్ చేశారు మేకర్స్. అదే 2026 సంక్రాంతి సీజన్‌లోనే నేను సైతం అంటున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేసింది యూనిట్. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి పొంగల్ రేసులో తారక్ నిలబడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గతంలో 2002లో ఈ ఇద్దరు హీరోలు తలపడ్డారు. చిరు ఇంద్ర సినిమా రిలీజ్‌కు ఐదు రోజుల ముందు అల్లరి రాముడు సినిమాను రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలకు దర్శకుడు బి. గోపాలే. అయినా అప్పటి పరిస్థితుల వల్ల ఒకే టైమ్ రిలీజ్ చేయక తప్పలేదు. ఈ పోటీలో చిరుదై పై చేయి అయ్యింది.

ఇప్పుడు మరోసారి చిరు, తారక్ బరిలో దిగుతుండటంతో ఈ సారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. హీరోల రేంజ్‌తో పాటు సినిమా మార్కెట్ లెక్కల్లోనూ తేడా వచ్చింది. మరి ఈ సారి ఇద్దరి మధ్య క్లాష్ తప్పకపోతే ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.




