- Telugu News Photo Gallery Cinema photos There have been many changes in film making since the Pan India trend began, but this trend continues
Tollywood Updates: పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత కమర్షియల్ సినిమా మేకింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మేకింగ్, కాస్టింగ్, టేకింగ్ ఇలా ప్రతీ విషయంలోనూ చేంజెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఓ కమర్షియల్ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. మాస్ ఆడియన్స్‌ను అలరించాలంటే కాస్త మసాల అవసరమనే ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఏంటి మసాలా అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్ స్టోరీ.
Updated on: Apr 27, 2025 | 10:34 AM

రీసెంట్ టైమ్స్‌లో బిగ్ స్క్రీన్‌ను షేక్ చేసిన స్పెషల్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. పుష్పలో ఊ అంటావా... పుష్ప 2లో కిస్సిక్ పాటలు సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేశాయి. అందుకే మాస్ యాక్షన్ సినిమాలకు కంపల్సరీ ఎలిమెంట్‌గా మారింది స్పెషల్ సాంగ్.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఛాన్స్ దొరికనప్పుడల్లా స్పెషల్ సాంగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కేజీఎఫ్‌లో తమన్నా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సలార్ మూవీలో మాత్రం ఎలాంటి స్పెషల్ సాంగ్ లేదు.

మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమాలోనూ అలాంటి స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు నీల్. ఆ పాట కోసం హ్యాపెనింగ్ బ్యూటీ శ్రుతి హాసన్‌ను రంగంలోకి దించుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్.

అప్పుడెప్పుడో మహేష్‌తో కలిసి జంక్షన్‌లో అంటూ దుమ్మలేపారు శ్రుతి. రీసెంట్‌గా నాని సినిమాలో ఓడీయమ్మ హీటు అంటూ పబ్ సాంగ్‌లో రెచ్చిపోయారు. ఇప్పుడు తారక్‌తో కలిసి ఎలాంటి మాస్ బీట్స్‌కు స్టెప్ వేయబోతున్నారో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

సీనియర్ బ్యూటీసే కాదు యంగ్ బ్యూటీస్ కూడా స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా రాబిన్‌హుడ్‌లో అదిదా సర్‌ప్రైజ్, మ్యాడ్ స్క్వేర్‌లో స్వాతి రెడ్డి పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.




