- Telugu News Photo Gallery Cinema photos Hollywood movie series that have entertained generations in recent times are coming to an end
Hollywood: ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..
కొన్ని మూవీ సిరీస్‌లకు భాషా ప్రాంతంతో సంబంధం ఉండదు. ఏ భాషలో తెరకెక్కినా.. ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తాయి. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ మధ్యకాలంలో అలా జనరేషన్స్‌గా అలరిస్తున్న సిరీస్‌లకు ముగింపు పలికేస్తున్నారు మేకర్స్. దీంతో ఇన్నేళ్లుగా ఆ సిరీస్‌లను ఆదరిస్తున్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Updated on: Apr 27, 2025 | 10:00 AM

టామ్ క్రూజ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్'. ఎంఐ సిరీస్‌లో వస్తున్న ఆఖరి సినిమా ఇదే. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఏడు సినిమాలు వచ్చాయి. అన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

చివరి సినిమాగా 'ది ఫైనల్ రికనింగ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో యాక్షన్ మూవీ లవర్స్‌తో పాటు టామ్ క్రూజ్ ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేయటం కన్నా... మళ్లీ ఈ సిరీస్‌లో సినిమా రాదని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు.

మరో ఫేమస్ సిరీస్ వెనమ్‌కు కూడా ముగింపు పలికింది హాలీవుడ్. 2018లో మొదలైన ఈ సిరీస్‌ను 2024లో రిలీజ్ అయిన వెనమ్ : ది లాస్ట్ డ్యాన్స్ సినిమాతో ఆపేశారు. ఈ సిరీస్‌లో వచ్చింది మూడు సినిమాలే అయినా... ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించాయి.

అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్ అవెంజర్స్. మల్టీవర్స్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఎంతో మంది సూపర్ హీరోలు సందడి చేశారు. అయితే 2022లొ వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్‌తో ఈ సిరీస్‌ను ముగిస్తున్నట్టుగా ప్రకటించింది మూవీ టీమ్.

కానీ ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్‌లు రావటంతో సరికొత్తగా అవెంజర్స్ సిరీస్‌ను రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. మరి మిషన్ ఇంపాజిబుల్ విషయంలోనూ మేకర్స్ అలాంటి డెసిషన్ తీసుకుంటారేమో చూడాలి.




