Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

చిన్న వయసులోనే యాడ్స్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయిన చిన్నారులు చాలా మంది ఉన్నారు. ఆతర్వాత టాప్ హీరోహీరోయిన్లుగా వెండితెరపై సందడి చేశారు. దూరదర్శన్ లో వచ్చిన రస్నా యాడ్ గుర్తుందా.. ? అందులో కనిపించిన చిన్నారి రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‏గా చేసిందని మీకు తెలుసా.. ? ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Rasna
Rajitha Chanti
|

Updated on: May 17, 2025 | 1:29 PM

Share

ఒకప్పుడు దూరదర్శన్‏లో ఎక్కువగా పాపులర్ అయిన యాడ్ రస్నా. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ ప్రకటన ఎక్కువగా కనిపించేది. ఇక ఈ ప్రకటనలో ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపించిన కనిపించిన చిన్నారి సైతం అదే స్థాయిలో పాపులర్ అయ్యింది. ఒకప్పుడు రస్నా యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేసిన ఈ చిన్నారి.. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిందని మీకు తెలుసా..? అంతేకాదు.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అంకిత.

అప్పట్లో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంకిత. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. ఇందులో గ్లామర్ బ్యూటీగా కనిపించి మెస్మరైజ్ చేసింది అంకిత. ఆ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది ఈ భామ. నిజానికి అంకిత చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, నవవసంతం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.

Ankitha

Ankitha

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..